Vijay : లియో సినిమాలో అలా చేసినందుకు.. తమిళ్ హీరో విజయ్ పై పోలీస్ కేసు..
తమిళ్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఇటీవల లియో సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ లో విజయ్ అలా చేసినందుకు..
![Vijay : లియో సినిమాలో అలా చేసినందుకు.. తమిళ్ హీరో విజయ్ పై పోలీస్ కేసు.. Vijay : లియో సినిమాలో అలా చేసినందుకు.. తమిళ్ హీరో విజయ్ పై పోలీస్ కేసు..](https://10tv.in/wp-content/uploads/2023/06/Police-case-file-on-Tamil-Hero-Vijay-due-to-Leo-movie-first-single-lyrical-video.jpg)
Police case file on Tamil Hero Vijay due to Leo movie first single lyrical video
Vijay – Leo : తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘లియో’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మాథ్యూ థామస్.. తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Adipurush : 10 రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ ఎంతంటే..? బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు..!
‘నా రెడీ’ అంటూ సాగే ఈ పాటకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ దీని పై పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయ్యింది. ఈ పాట మద్యం మరియు పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ విజయ్ పై నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రముఖ తమిళ్ క్రిటిక్ మనోబాల విజయబాలన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Just IN: Complaint has been given to Police Commissioner to take action against actor #Vijay under the section of Narcotics Control Act for portraying the same in #NaaReady song in #LeoFilm. pic.twitter.com/9xu6UAaYiZ
— Manobala Vijayabalan (@ManobalaV) June 26, 2023
Pawan Kalyan : OG నుంచి అదిరిపోయే అప్డేట్.. అప్పుడే సగం షూటింగ్ అయిపోయిందట..
కాగా ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ స్టోరీ లైన్ డ్రగ్స్ నేపథ్యంతో సాగుతున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే సాంగ్ ఉందంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీని పై మూవీ టీం మాత్రం స్పందించలేదు. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. గతంలో లోకేష్ అండ్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.