Poonam Kaur: విడాకులపై పూనమ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించబ్బా?

పూనమ్ కౌర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారే సంగతి తెలిసిందే. నెటిజన్లు కూడా పూనమ్ చేసే పోస్టులపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎవరి గురించి ..

Poonam Kaur: విడాకులపై పూనమ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించబ్బా?

Poonam Kaur (1)

Updated On : November 9, 2021 / 8:39 AM IST

Poonam Kaur: పూనమ్ కౌర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారే సంగతి తెలిసిందే. నెటిజన్లు కూడా పూనమ్ చేసే పోస్టులపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేసిందో.. ఏ అంశం మీద ఈ కామెంట్స్ చేసిందో అని విశ్లేషణలు కూడా చేస్తుంటారు. అయితే.. పూనమ్ మాత్రం ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసిందో చెప్పకుండానే చెప్పేస్తుంటుంది. తాజాగా పూనమ్ విడాకుల అంశంపై భారీ పోస్టు పెట్టి.. ఆ తర్వాత కొద్దిసేపటికి అది డిలీట్ చేసింది.

 

Poonam Kaur

Poonam Kaur

Adipurush: ట్వీట్ మిస్టేక్.. సన్నీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం!

దీంతో పూనమ్ ఈసారి ఇది ఎవరికి గురించి ఈ పోస్ట్ చేసిందా అని నెటిజన్లు చర్చ పెట్టారు. విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా? ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు.. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?’ అంటూ పూనమ్ వరస ప్రశ్నలు సంధించింది.

Samantha: సామ్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌత్ నటిగా గుర్తింపు!

అయితే ఈ ట్వీట్‌ చేసిన గంట వ్యవధిలోనే పూనమ్‌ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. దీంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది.. మళ్ళీ ఎందుకు డిలీట్ చేసింది అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఇప్పుడు విడాకుల అంశంపై ఇంత లోతుగా స్పందించాల్సిన అవసరం పూనమ్ కి ఎందుకొచ్చింది అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మరి ఇంతకీ పూనమ్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్ట్ చేసిందో కనీసం వాళ్ళకైనా ఈ పోస్ట్ చేరిందో లేక ఈలోపే డిలీట్ చేసిందో!