SPIRIT Movie : ప్రభాస్‌ పక్కన సౌత్ కొరియన్ పాప..

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కోసం సౌత్ కొరియన్ నటి కిమ్ సో హ్యూన్..

SPIRIT Movie : ప్రభాస్‌ పక్కన సౌత్ కొరియన్ పాప..

Spirit Movie

SPIRIT Movie: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘ఆదిపురుష్’ షూటింగ్‌కి రీసెంట్‌గా గుమ్మడికాయ కొట్టారు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ – కె’ పూర్తి చెయ్యాల్సి ఉంది.

SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!

తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చెయ్యనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియన్ డైరెక్టర్‌ల కలయికలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది టీ-సిరీస్ సంస్థ. ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా రానున్న ఈ మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

ఇప్పుడు వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ఏంటంటే.. ‘స్పిరిట్’ లో ఓ క్రూషియల్ రోల్ కోసం పాపులర్ సౌత్ కొరియన్ యాక్ట్రెస్ కిమ్ సో హ్యూన్ ను సంప్రదించబోతున్నారట టీం. 22 ఏళ్ల కిమ్, హోస్ట్‌గా, మోడల్‌గా, బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘స్పిరిట్’ పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కాబట్టి కిమ్‌తో నెగిటివ్ క్యారెక్టర్ చేయిస్తే బాగుంటందనేది మేకర్స్ ప్లాన్.

Kim So Hyun