Adipurush : ఆ థియేటర్స్‌లో ఆదిపురుష్ నో రిలీజ్.. కలెక్షన్స్‌కి దెబ్బ పడనుందా..?

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా ఆ థియేటర్స్ లో విడుదల కావడం లేదట.

Adipurush : ఆ థియేటర్స్‌లో ఆదిపురుష్ నో రిలీజ్.. కలెక్షన్స్‌కి దెబ్బ పడనుందా..?

Prabhas Adipurush movie should not be released in IMAX theaters india wide

Prabhas Adipurush : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఈ వారమే రిలీజ్ కాబోతుంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా అంచనాలను మరింత పెంచేసింది. దీంతో మూవీని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ పై భారీ హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అని భావించారు ప్రభాస్ అభిమానులు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ కొన్ని థియేటర్స్ లో రిలీజ్ కి నోచుకోవడం లేదు.

Project K : ప్రాజెక్ట్ K మ్యూజిక్ కోసం ప్రపంచాన్ని చుడుతున్న సంతోష్ నారాయణ్.. ఉగాండాలో మొదలు!

సినిమాని బెటర్ గా ఎక్స్‌పీరెన్స్ చేయడానికి ఆడియన్స్ IMAX థియేటర్స్ లో చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా విజువల్ వండర్ మూవీస్ ని ఆ థియేటర్స్ లోనే చూడాలని ఫీల్ అవుతుంటారు. కానీ ఆదిపురుష్ ని ఇండియా వైడ్ IMAX లో ఎక్కడా రిలీజ్ చేయడం లేదు. దీంతో ఈ మూవీ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ విషయంలో కొంత దెబ్బ పడే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణసంస్థ టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థతో కలిసి ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Bandla Ganesh : బాలయ్యతో కాదు పవన్‌తో సినిమా తీయడం నా డ్రీమ్.. నాగవంశీకి బండ్ల గణేష్ ట్వీట్!

రామాయణం కథతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు రాముడి కథని చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరు టికెట్స్ ని బుక్ చేసేసుకుంటున్నారు.