Project K : ప్రాజెక్ట్ K మ్యూజిక్ కోసం ప్రపంచాన్ని చుడుతున్న సంతోష్ నారాయణ్.. ఉగాండాలో మొదలు!

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్..

Project K : ప్రాజెక్ట్ K మ్యూజిక్ కోసం ప్రపంచాన్ని చుడుతున్న సంతోష్ నారాయణ్.. ఉగాండాలో మొదలు!

Project K Music Director Santhosh Narayanan starts musical sittings at Uganda

Prabhas Project K : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీ దత్ చాలా ప్రితిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక అద్భుతమైన కథతో ప్రాజెక్ట్ K తెరకెక్కుతుండడంతో సంతోష్.. సినిమాలోని సంగీతాన్ని కూడా అంతే అద్భుతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

Tiger Shroff : టైగర్‌ ష్రాఫ్‌ తల్లిని మోసం చేసిన వ్యక్తి.. బురిడీ కొట్టించి అరకోటి మాయం.. పోలీసులకు పిర్యాదు..

ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కోసం ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నాడు. వరల్డ్ లోని బెస్ట్ టెక్నీషియన్స్ తో కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ రెడీ చేస్తున్నాడు. ఈ మూవీ మ్యూజికల్ సిట్టింగ్స్ ని ఆఫ్రికాలోని ఉగాండాలో మొదలు పెట్టాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. అక్కడి నుంచి ఒక ఫోటో షేర్ చేసి ప్రాజెక్ట్ K మ్యూజికల్ జర్నీ మొదలైందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పత్రాలు చేస్తున్నారు.

Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్‌ కార్యక్రమంలో మెగా, అల్లు కుటుంబాలు..

అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పడుకోణె (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్స్ కూడా భాగం కానున్నట్లు నిర్మాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్ హీరో రానా ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ..
బాహుబలి, RRR సినిమాలు క్రియేట్ చేసిన బౌండరీస్ ని ప్రాజెక్ట్ K చిత్రం చెరిపేయనుందని, సరికొత రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చి మరింత అంచనాలు పెంచేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Santhosh Narayanan (@musicsanthosh)