Bandla Ganesh : బాలయ్యతో కాదు పవన్‌తో సినిమా తీయడం నా డ్రీమ్.. నాగవంశీకి బండ్ల గణేష్ ట్వీట్!

బాబీ డైరెక్షన్ లో నాగవంశీ నిర్మాణంలో బాలయ్య తన 109వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ ఈ సినిమా గురించి చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Bandla Ganesh : బాలయ్యతో కాదు పవన్‌తో సినిమా తీయడం నా డ్రీమ్.. నాగవంశీకి బండ్ల గణేష్ ట్వీట్!

Bandla Ganesh viral tweet on balakrishna bobby nagavamsi movie

Updated On : June 11, 2023 / 2:45 PM IST

Bandla Ganesh – Balakrishna : నందమూరి బాలకృష్ణ నిన్న (జూన్ 10) తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య 109వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ కూడా ఈ సినీ నిర్మాణంలో భాగం కాబోతున్నాయి.

Anupama Parameswaran : లేడీ మల్టీస్టారర్.. అనుపమ పరమేశ్వరన్ తో మరో మలయాళీ హీరోయిన్.. సూపర్ కాంబో

ఇక ఈ మూవీ గురించి అనౌన్స్ చేస్తూ నాగవంశీ ఒక ట్వీట్ చేశాడు. “టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాలయ్యతో సినిమా చేయడం నా డ్రీమ్. ఇప్పుడు మా నిర్మాణంలో 25వ ప్రాజెక్ట్ గా ఆయనతో సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ నాగవంశీ రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కి బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. “ఎప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ నా డ్రీమ్ ఒకటే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయటం, తీస్తూ ఉండటం. అదే నా డ్రీమ్, అదే లక్ష్యం” అంటూ చెప్పుకొచ్చాడు.

Mokshagna Teja: మోక్షజ్ఞ నయా లుక్.. యంగ్ సింహం వ‌చ్చేస్తుందంటూ కామెంట్లు

అయితే ఈ ట్వీట్ బండ్ల గణేష్ కౌంటర్ ఇస్తూ చేశాడు అంటున్నారు నెటిజెన్లు. కొన్ని రోజులు నుంచి బండ్ల గణేష్.. దర్శకుడు త్రివిక్రమ్ పై వైరల్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ కూడా త్రివిక్రమ్ స్నేహితుడు కావడం, ఇప్పుడు బాలయ్య సినిమాలో సహనిర్మాతగా త్రివిక్రమ్ భార్య సౌజన్య వ్యవహరిస్తుండడంతోనే బండ్ల గణేష్ ఆ ట్వీట్ చేశాడని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.