Mokshagna Teja: మోక్షజ్ఞ నయా లుక్.. యంగ్ సింహం వ‌చ్చేస్తుందంటూ కామెంట్లు

నందమూరి బాలకృష్ణ (Balayya) కుమారుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

Mokshagna Teja: మోక్షజ్ఞ నయా లుక్.. యంగ్ సింహం వ‌చ్చేస్తుందంటూ కామెంట్లు

Mokshagna Teja New look

Updated On : June 10, 2023 / 9:30 PM IST

Mokshagna: నందమూరి బాలకృష్ణ (Balayya) కుమారుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావ‌డం ఖాయ‌మ‌ని బాల‌య్య ఎప్పుడో చెప్పారు. ఆ నాటి నుంచి మోక్ష‌జ్ఞ ఎప్పుడు ఏ సినిమాతో వ‌స్తాడు, ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతాడు అన్నది హాట్ టాఫిక్‌గా మారిపోయింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు మోక్ష‌జ్ఞ ఎంట్రీ పై ఎలాంటి క్లారిటీ లేదు.

కాగా.. యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో మోక్ష‌జ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు కాస్త బొద్దుగా క‌నిపించిన మోక్ష‌జ్ఞ ఇప్పుడు ఒక్క‌సారిగా స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడు. అత‌డు త‌న స్నేహితుల‌తో క‌నిపించిన కొన్ని ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో స్లిమ్‌ బాడీతో హ్యాండ్సమ్‌గా క‌నిపిస్తున్నాడు. దీంతో యంగ్ సింహం వ‌చ్చేస్తుందంటూ ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Mokshagna: బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కన్ఫం.. కానీ హీరో కాదట..?

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. హీరోగా కాకుండా కేమియా త‌ర‌హా పాత్ర‌లో మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ట‌. మాస్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా త‌రువాత బోయ‌పాటి త‌న నెక్ట్స్ మూవీని బాల‌య్య‌తో చేయ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో మోక్ష‌జ్ఞ క‌నిపించ‌నున్నాడ‌ట‌. మోక్ష‌జ్ఞ నిజంగానే ముందుగా అతిథి పాత్ర‌లో న‌టించి ఆ త‌రువాత హీరోగా మారాల‌ని అనుకుంటున్నాడా..? లేక నేరుగా హీరోగానే అరంగ్రేటం చేస్తాడా..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

NBK 109 : బాలయ్య బర్త్ డే సర్‌ప్రైజ్ అదిరిందిగా.. బాబీతో బాలయ్య సినిమా.. NBK109 ఓపెనింగ్..