Pushpa Collections: భారీ వసూళ్ల దిశగా పుష్ప.. నార్త్‌లో తగ్గని హవా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో..

Pushpa Collections: భారీ వసూళ్ల దిశగా పుష్ప.. నార్త్‌లో తగ్గని హవా!

Pushpa

Pushpa Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో కూడా అదే తరహా వసూళ్లను రాబడుతూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

Pushpa Movie : రెండో వారంలోనూ రచ్చ లేపాడు.. 200 కోట్ల క్లబ్‌లోకి దగ్గర్లో..

ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలైన 17వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. అంతేకాదు హిందీలో పుష్ప సినిమాకు హైయ్యస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ రావడం విశేషం. ఇప్పటికే బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న పుష్ప సినిమాకు 60 కోట్లు పైగా కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా పుష్ప నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ సినిమా 83, హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ లాంటి చిత్రాలు ఉన్నప్పటికీ పుష్ప హౌజ్ ఫుల్ తో దూసుకు పోతుండటంతో సినిమా లాంగ్ రన్ లో మరింత ఎక్కువ వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకూ బాలీవుడ్ లో ఈ చిత్రం 62 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ చిత్రం గా నిలిచింది.