Pushpa Movie : రెండో వారంలోనూ రచ్చ లేపాడు.. 200 కోట్ల క్లబ్‌లోకి దగ్గర్లో..

‘పుష్ప’ హిందీ వెర్షన్ రూ. 50 కోట్లకు దగ్గర్లో ఉంది.. అలాగే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చాలా చేరువలో ఉంది..

Pushpa Movie : రెండో వారంలోనూ రచ్చ లేపాడు.. 200 కోట్ల క్లబ్‌లోకి దగ్గర్లో..

Pushpa Movie

Updated On : December 30, 2021 / 3:51 PM IST

Pushpa Movie: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌-బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌‌ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘పుష్ప’.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంతో బాలీవుడ్‌లో బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని దానికి‘పుష్ప’ సినిమానే ఉదాహరణ అంటూ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ ఇటీవల చెప్పారు. ‘పుష్ప’ హిందీ వెర్షన్ రూ. 50 కోట్లకు దగ్గర్లో ఉంది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్‌గా 166.82 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో వారంలోనూ మంచి వసూళ్లు వచ్చాయి. దాదాపు రూ. 31 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 197.10 కోట్ల గ్రాస్ తెచ్చుకుని రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవబోతోంది. రెండో వారం వసూళ్లు ఇలా ఉన్నాయి.

Pushpa Thank You Meet : కంటతడి పెట్టిన సుకుమార్..

Day 1 – రూ. 5.22 కోట్లు
Day 2 – రూ. 7.10 కోట్లు
Day 3 – రూ. 7.67 కోట్లు
Day 4 – రూ. 4.03 కోట్లు
Day 5 – రూ. 3.41 కోట్లు
Day 6 – రూ. 2.85 కోట్లు
Total – రూ. 197.10 కోట్లు
ఇక కేరళలో అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుస్తారు. కేరళలో ‘పుష్ప’ రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబడుతోంది.

Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!