Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా.. బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచి ఐదు రోజులుగా స్టడీ వసూళ్లతో రికార్డుల దిశగా వెళ్తుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ తో సినిమాను నిలబెట్టాడని విశ్లేషకుల టాక్ కాగా సినిమా కూడా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది. కాగా, ఈ మధ్య కాలంలో నిండా నెల తిరిగే సమయానికే నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కూడా చేసేసి భారీ బిజినెస్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

RRR: బ్లాస్టింగ్ ఎపిసోడ్‌కు గెస్టులుగా చిరు-బాలయ్య.. బొమ్మ దద్దరిల్లాల్సిందే!

బన్నీ పుష్ప సినిమా ఓటీటీ బిజినెస్ కూడా భారీ ధరకే జరిగినట్టు తెలుస్తుంది. పుష్ప డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకి దక్కించుకున్న సంగతి తెలిసిందే. సహజంగా స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా విడుదలైన నెల రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తారు. అయితే.. సంక్రాంతిని క్యాష్ చేసుకొనేలా మరో వారం ముందే అంటే సంక్రాంతికే పుష్ప డిజిటల్ రిలీజ్ కూడా చేస్తారని నిన్నటి వరకు టాక్ నడిచింది. కానీ.. ఇది ఎంత మాత్రం నిజం కాదని నిర్మాతల నుండి వినిపిస్తున్న మాట.

Pushpa: తగ్గేదేలే.. హీటెక్కిస్తున్న పుష్పరాజ్ లెక్కలు!

పుష్ప సినిమా విడుదల అనంతరం నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారట. దీని బట్టి జనవరి 17 తర్వాతే స్ట్రీమింగ్ చేసే వీలుంటుంది. అయితే.. అప్పటికే థియేటర్లలో భారీ సినిమాలు ఉంటాయి కనుక మరో వారం రోజుల తర్వాతే అమెజాన్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. దాదాపుగా జనవరి నెలాఖరునే పుష్ప డిజిటల్ రిలీజ్ ఉంటుందని దీనిపై మేకర్స్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.