Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

పుష్ప ధియేటర్లోకి రావడానికి ఇంకా నెలరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి. ఏ రోజు కారోజు ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న బన్నీ..

Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

Pushpa

Pushpa: పుష్ప ధియేటర్లోకి రావడానికి ఇంకా నెలరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి. ఏ రోజు కారోజు ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న బన్నీ.. లేటెస్ట్ గా ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అంటున్నారు. ఆల్రెడీ రికార్డ్ వ్యూస్ ని అకౌంట్ లో వేసుకున్న పుష్ప ఈ బిడ్డా పాటతో మరో క్రేజీ రికార్డ్ కోసం రెడీ అవుతోంది.

Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

పుష్ప దూకుడు మామూలుగా లేదు. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీపై బన్నీ దూకుడు పెంచాడు. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదంటున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబందించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే క్రేజీ సాంగ్ ప్రోమోతో ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెంచేశారు. మరో రెండు రోజులలో ఈ నాలుగో సింగల్ కూడా వచ్చేస్తుంది.

Anubhavinchu Raja: ప్రామిసింగ్ ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ తెచ్చిన రాజ్ తరుణ్!

ప్రజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఏ పెద్ద సినిమాకీ లేనంత దూకుడు చూపిస్తూ పుష్ప ఫీవర్ ని ఫాన్స్ లో తెగపెంచేస్తున్నాడు బన్నీ. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన 3 పాటలూ పుష్ప ని రికార్డ్స్ విషయంలో టాప్ ప్లేస్ లో నించోబెట్టాయి. లేటెస్ట్ గా శాంపిల్ చూపించిన ఏయ్ బిడ్డా సాంగ్ కూడా ఆ లిస్ట్ లో యాడ్ అవుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. అలా సినిమా రిలీజ్ అవ్వకముందే పుష్ప యూనిట్ ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు.

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలిచినా చేతికి వచ్చేది ఇంతే..

ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తూ ఫ్యాన్స్ లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు. పుష్పకు సంబందించి ఒక్కో సాంగ్ బయటికొస్తుంటే.. ఫ్యాన్స్ లో జోష్, ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి చేరిపోతోంది. ప్రజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఏ స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో ప్రమోషన్లు చెయ్యడం లేదు. కానీ బన్నీ మాత్రం పుష్ప సినిమాకి సంబందించి ఫుల్ దూకుడు చూపిస్తున్నాడు. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచడానికి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పాటు పాటలు కూడా మాంచి టైమ్ కి రిలీజ్ చేస్తున్నారు.