Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలకి బయటకొచ్చే ముహుర్తాలు దొరకలేదు. ఇప్పుడు విడుదల చేసేందుకు పరిస్థితిలు అనుకూలించినా అందరూ కలిసి ఏ పండగకో ముహూర్తం పెట్టుకున్నారు.

Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

Sankranthi 2022

Updated On : November 17, 2021 / 3:09 PM IST

Sankranthi 2022: మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలకి బయటకొచ్చే ముహుర్తాలు దొరకలేదు. ఇప్పుడు విడుదల చేసేందుకు పరిస్థితిలు అనుకూలించినా అందరూ కలిసి ఏ పండగకో ముహూర్తం పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడా అని సీజన్ కోసం వెయిట్ చేసి సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. ఇందులో కొందరు డిసెంబర్ లో యుద్దానికి దిగితే మరికొందరు సంక్రాంతికి నువ్వా నేనా సై అంటున్నారు. అలా టాలీవుడ్ లో రిలీజ్ క్లాష్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

Anubhavinchu Raja: ప్రామిసింగ్ ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ తెచ్చిన రాజ్ తరుణ్!

ముందుగా సంక్రాంతి పండగకి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ తో పాటు తమిళ హీరో అజిత్ వాలిమై విడుదలకి సిద్ధమయ్యారు. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఇచ్చిన తర్వాత మహేష్ మెల్లగా పోటీ నుండి తప్పుకొని ఏప్రిల్ ఒకటికి ఫిక్స్ చేసుకున్నాడు. ఇక, మిగతా వాళ్ళు కూడా ఇదే బాటలో ఒకరిద్దరు తగ్గుతారని అనుకున్నా అదేమీ జరిగేలా లేదు. రాధేశ్యామ్ వెనక్కి తగ్గే అవకాశం లేదని తొలి నుండి వినిపించగా వెనక్కి తగ్గుతాడని అనుకున్న భీమ్లా నాయక్ కూడా తగ్గేదేలా అని వచ్చేందుకే ఫిక్స్ అయ్యాడు.

అమెరికాలో మైక్ టైసన్‌తో కలిసి రచ్చ చేస్తున్న ‘లైగర్’ టీం

ఒకవైపు బడా హీరోల భారీ సినిమాలన్నీ ఒకేసారి విడుదల అవుతుంటే మరోవైపు టికెట్ ధరలపై కూడా ప్రభుత్వాలతో లొల్లి ఒకటి ఇండస్ట్రీని వేధిస్తుంది. ఇప్పుడు ఈ రెండు సమస్యలపై టాలీవుడ్ పెద్దలు కొందరు చర్చల ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ నిర్మాతల మండలితో పాటు సినీ పెద్దలు కొందరు ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉండగా ఈ మీటింగ్ అనంతరం సంక్రాంతి సినిమా విడుదలలో మార్పులు ఉండడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి, ఆ మార్పు ఎలా ఉంటుందో చూడాలి.