Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలిచినా చేతికి వచ్చేది ఇంతే..

ఓ వ్యక్తి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయలు దక్కించుకొని రికార్డు సృష్టించాడు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నా రాజార‌వీంద్రకు చేతికి దక్కేది

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలిచినా చేతికి వచ్చేది ఇంతే..

Emk (2)

Evaru Meelo Koteeswarulu :  గత కొన్ని రోజులుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి కోటి రూపాయల వరకు దక్కించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కోటి రూపాయలు ఎవ్వరూ దక్కించుకోలేదు. తాజాగా ఓ వ్యక్తి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయలు దక్కించుకొని రికార్డు సృష్టించాడు. కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ రాజార‌వీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్నారు.

అమెరికాలో మైక్ టైసన్‌తో కలిసి రచ్చ చేస్తున్న ‘లైగర్’ టీం

ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు రాజారవీంద్ర సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. రాజారవీంద్ర ప్రైజ్ మ‌నీ గెలిచిన ఎపిసోడ్ ఇటీవల ప్రసారం అయింది. రాజారవీంద్ర ఖమ్మం జిల్లాకి చెందిన వ్యక్తి. ఈయనకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్‌ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. రాజా రవీంద్ర ఇదివరకు సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత 2012లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన లక్ష్యం అని ఆయన తెలిపారు. అయితే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నా రాజార‌వీంద్రకు చేతికి దక్కేది మాత్రం తక్కువే.

Puneeth Rajkumar : పునీత్‌కు నివాళి .. విజయోత్సవ సభలు జరిగిన చోటే సంస్మరణ సభ

ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గెలిస్తే వాళ్ళు కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా షోలో గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి‎‎ చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ మనీ ఇచ్చేటప్పుడు టీవీలో చెక్ మీద కోటి రూపాయలు చూపించినా తర్వాత మాత్రం పన్ను మినహాయించి మిగిలిన డబ్బులు చెల్లిస్తారు. అంటే ‘‎‎ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి రూపాయలు గెలిస్తే విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది.