Radhe Shyam: స్పీడ్ పెంచుతున్న ప్రమోషన్లు.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ చూపులు!

సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉన్న రాధేశ్యామ్ కూడా ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. పండగ బరిలో ఉన్న ఈ క్రేజీ మూవీ సాలిడ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో..

Radhe Shyam: స్పీడ్ పెంచుతున్న ప్రమోషన్లు.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ చూపులు!

Radhe Shyam

Radhe Shyam: సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉన్న రాధేశ్యామ్ కూడా ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. పండగ బరిలో ఉన్న ఈ క్రేజీ మూవీ సాలిడ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫాన్స్ లో ఎనర్జీ తెచ్చిన ప్రభాస్.. లేటెస్ట్ గా మరికొన్ని ఇంట్రస్టింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేసింది. ఈవెంట్లు సరే.. మరి ప్రభాస్ డైరెక్ట్ ప్రమోషన్స్ కి దిగేదెప్పుడు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అనుకుంటుండగానే రాధేశ్యామ్ లైన్లోకొస్తోంది. జనవరి రిలీజ్ సినిమాలు ప్రమోషన్ల మోత మోగిస్తుంటే.. రాధేశ్యామ్ ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల రూట్ లోకి వస్తోంది.

Bollywood Stars: ఛలో ఫారిన్.. సెలబ్రిటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..!

అప్పుడప్పుడు పాటలతో పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఇంట్రస్ట్ పెంచేసింది. అయితే ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని వేరే లెవల్ కి తీసుకెళ్లడానికి ప్రమోషన్ల స్పీడ్ మరింత పెంచింది రాధేశ్యామ్ టీమ్. రాధేశ్యామ్ ప్రమోషన్లలో భాగంగా లేటెస్ట్ గా మ్యూజికల్ ఫెస్ట్ ఎరేంజ్ చేశారు టీమ్. యూత్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి సాంగ్ కాంపిటీషన్స్ తో హడావిడి చేస్తున్నారు యూనిట్. దీనికోసం స్పెషల్ వెహికల్ తో టూర్ ప్లాన్ చేశారు. వీటితో పాటు వైజాగ్ ఫాన్ మీట్ కూడా ఏర్పాటు చేశారు టీమ్. స్పెషల్లీ రాధేశ్యామ్ కి సంబంధించి ఏం రిలీజ్ అయినా అవి ఫాన్స్ చేతుల మీదుగానే రిలీజ్ చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

ఈవెంట్లు, మ్యజికల్ ఫెస్ట్ లు ఎన్ని జరిగినా.. డైరెక్ట్ గా పాన్ ఇండియా స్టార్ రంగంలోకి దిగితే ఆ కిక్కే వేరు. అందుకే బాస్ వచ్చే లోపు సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేస్తే.. మిగతాది ప్రభాస్ చూసుకుంటాడంటున్నారు టీమ్. జనవరి 7 నుంచి ప్రభాస్ కూడా డైరెక్ట్ ప్రమోషన్స్ కి దిగుతున్నారు. జనవరి 7 నాటికి ట్రిపుల్ఆర్ హడావిడి ఆల్ మోస్ట్ అయిపోతుంది కాబట్టి.. అప్పటి నుంచి బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్స్ తో బిజీ కాబోతున్నారు ప్రభాస్. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికే సాంగ్స్, వీడియోలతో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది.