Bollywood Stars: ఛలో ఫారిన్.. సెలబ్రిటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..!

ఈ సంవత్సరం ఎలాగూ పాండమిక్ తో పాటు.. హిట్, ఫ్లాపులతో గడిచిపోయింది సినిమా ఇండస్ట్రీ. పాత సంవత్సరం ఎలా గడిచినా న్యూ ఇయర్ లోకి కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సెలబ్రిటీలు.

Bollywood Stars: ఛలో ఫారిన్.. సెలబ్రిటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..!

Bollywood Stars

Bollywood Stars: ఈ సంవత్సరం ఎలాగూ పాండమిక్ తో పాటు.. హిట్, ఫ్లాపులతో గడిచిపోయింది సినిమా ఇండస్ట్రీ. పాత సంవత్సరం ఎలా గడిచినా న్యూ ఇయర్ లోకి కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సెలబ్రిటీలు. అందుకే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అప్పుడే ఫారెన్ చెక్కేశారు. 2022 కొత్త సంవత్సరాన్ని క్రేజీగా స్టార్ట్ చెయ్యబోతున్నారు సెలబ్రిటీలు. అందుకే వీకెండ్ లో వచ్చిన న్యూఇయర్ ని సెలబ్రేట్ చేస్కోడానికి ఫారెన్ చెక్కేస్తున్నారు.

Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

లేటెస్ట్ గా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. 83 సక్సెస్ తో హ్యపీ మూడ్ లో ఉన్న ఈ హ్యాపెనింగ్ కపుల్ క్రేజీ డ్రెస్సింగ్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. బాలీవుడ్ రూమర్డ్ పెయిర్ కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా కూడా న్యూఇయర్ వెకేషన్ కోసం ఫారెన్ వెళుతూ ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు. కొత్త సంవత్సరంలో తమ రిలేషన్ ని అఫీషియల్ చేస్తున్నారంటూ వినిపిస్తున్న రూమర్స్ వినిపిస్తున్న ఈ టైమ్ లో మాల్దీవ్స్ లో న్యూఇయర్ సెలబ్రేట్ చేస్కోడానికి చెక్కేస్తున్న ఈ జంట.. ఈ రూమర్స్ నిజం చేసేలా కనిపిస్తోంది.

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

నార్త్ లో మరో క్రేజీ లవ్ బర్డ్స్ దిశాపఠానీ, టైగర్ ష్రాఫ్ కూడా వెకేషన్ ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. బీచ్ గర్ల్ గా ఫోటోలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దిశాపఠానీ బీచ్ లో స్టన్నింగ్ ఫోటోలకు ఫోజులిచ్చింది. మరో వైపు కొన్ని పూల్ వీడియోల్ని, ఫోటోల్ని షేర్ చేస్తూ.. టైగర్ కూడా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేస్కోడానికి ఫారెన్ కి ముందే వెళ్లిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆల్రెడీ ఫ్యామిలీ తో కలిసి మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ సైకిల్ తో చక్కర్లు కొడుతున్న వీడియో షేర్ చేశారు. శిల్పాశెట్టితో పాటు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ లో కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్ కి ఫారెన్ వెళ్లిపోయారు.

Salman Khan: ఆటో నడిపిన సల్మాన్.. ఇన్సూరెన్స్ చేశారా అని ట్రోలింగ్!

ఇక టాలీవుడ్ లో రీసెంట్ గా బ్రేకప్ అయిన నాగచైతన్య, సమంత కూడా న్యూఇయర్ కి వెల్ కమ్ చెప్పడానికి గోవా వెళ్లిపోయారు. సమంత తన ఫ్రెండ్ శిల్పాతో పాటు ఎంజాయ్ చేస్తుంటే.. నాగచైతన్య.. తన ఫ్రెండ్స్ తో గోవాలో చిల్ అవుతున్నారు. ఇలా ఈ సంవత్సరం ఎలా ఉన్నా.. 2022కి మాత్రం గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి గట్టిగానే ప్లాన్లు వేసుకున్నారు స్టార్లు.