Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సూపర్ హిట్స్ కొడుతూనే.. దర్శకుడిగా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ నిర్మాతగా ఆయన..

Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

Sukumar Vijay Devarakonda

Updated On : December 30, 2021 / 3:29 PM IST

Sukumar-Vijay Devarakonda: డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సూపర్ హిట్స్ కొడుతూనే.. దర్శకుడిగా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ నిర్మాతగా ఆయన శిష్యులు తెరకెక్కించిన కుమారి 21 F, ఉప్పెన సినిమాలు ఎంత భారీ విజయాలు అందుకున్నాయి తెలిసిందే. కాగా తాజాగా పుష్పతో తొలి పాన్ ఇండియా సక్సెస్ కూడా అందుకున్నాడు సుక్కు. త్వరలోనే పుష్ప రెండో పార్ట్ కూడా పట్టాలెక్కించనున్న సుక్కూ.. రెండో పార్ట్ తొలి పార్టుకు మించి ఉండేలా తెరకెక్కించనున్నాడు.

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

ఇక, పుష్ప తర్వాత సుకుమార్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. మూడేళ్ళ క్రితమే ఈ సినిమాను ప్రకటించగా అల్లు అర్జున్ మిత్రుడైన కేదార్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావాల్సింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రకటనలకే పరిమితం అవుతుందేమో అన్న అనుమానాలొస్తున్నాయి. ఈ సినిమా ప్రకటన తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమేనని చాలా కాలంగా వినిపించినా ఇప్పుడు ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ‘పుష్ప-2’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

రామ్ చరణ్ తో సినిమా విషయాన్ని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బయటపడింది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2023 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తుండగా ఈ లోగా ఎలాగూ పుష్ప 2 పనులు.. ఆ తర్వాత చరణ్ సినిమా కోసం కథ, స్క్రిప్ట్ పనులు కూడా ఉన్నాయి. ఇక విజయ్ సినిమా అటకెక్కినట్లేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. ప్రకటన వచ్చిన మూడేళ్లకు కూడా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ సినిమా ఊసే ఎత్తడం లేదంటే ఈ సినిమా ఆగిపోయిందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారందరూ. మరి నిజమేంటో వాళ్ళకే తెలియాలి.