Salman Khan: ఆటో నడిపిన సల్మాన్.. ఇన్సూరెన్స్ చేశారా అని ట్రోలింగ్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ గత వారం నుండి రోజూ వార్తలలో నిలుస్తున్నాడు. రెండు రోజుల క్రితమే డిసెంబర్ 27న 56వ పడిలోకి అడుగుపెట్టిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Salman Khan: ఆటో నడిపిన సల్మాన్.. ఇన్సూరెన్స్ చేశారా అని ట్రోలింగ్!

Salman Khan

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ గత వారం నుండి రోజూ వార్తలలో నిలుస్తున్నాడు. రెండు రోజుల క్రితమే డిసెంబర్ 27న 56వ పడిలోకి అడుగుపెట్టిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా చేసుకోగా జెనీలియాతో డాన్స్ చేసి రచ్చ రచ్చ చేశాడు. అదలా ఉండగానే ఫామ్ హౌస్ లో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన సల్మాన్ అది విషపూరితమైన పాము కాకపోవడంతో సేఫ్ గా బయటపడ్డాడు. అవి రెండు సంఘటలను అయిపోగా బుధవారం రద్దీగా ఉండే ముంబైలోని పన్వెల్‌ రోడ్ మీద ఆటో నడుపుతూ సందడి చేశాడు.

Top 10 Most Viewed Telugu Songs: పాట నచ్చిందా.. హీరోలకు రికార్డులు కట్టబెడుతున్న నెటిజన్లు

బుధవారం పన్వెల్‌లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు ఈ సల్లూ భాయ్‌. భాయిజాన్‌ ఆటో నడపడం చూసి ఆశ్చర్యపోయిన ముంబై వాసులలో కొందరు సల్మాన్ ఆటో రైడ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆటో రిక్షాను నడిపిన సల్మాన్‌ను చూసిన అయన అభిమానులు మురిసిపోతుంటే కొందరు నెటిజన్లు మాత్రం సల్మాన్ మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

ఏంటి సల్మాన్ ఆటో నడుపుతున్నాడా.. ఇది ఒమిక్రాన్‌ కన్నా డేంజర్‌ అని ఒక యూజర్ కామెంట్‌ చేస్తే.. తర్వగా అందరూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చేసుకోండి అని మరో నెటిజన్ సెటైర్‌ వేశాడు. ఆటోలో పాము లేదా సల్మాన్ అని మరో క్రేజీ నెటిజన్ కామెంట్‌ పెట్టారు. మొత్తంగా సల్మాన్ ఆటో రైడ్ వ్యవహారం.. దాని వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)