Top 10 Most Viewed Telugu Songs: పాట నచ్చిందా.. హీరోలకు రికార్డులు కట్టబెడుతున్న నెటిజన్లు

ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టడానికి పోటాపోటీగా కష్టపడుతున్నారు మన హీరోల ఫ్యాన్స్. అటు బరిలోకి అదిరే సాంగ్ దింపడం వరకే మా బాధ్యత..

Top 10 Most Viewed Telugu Songs: పాట నచ్చిందా.. హీరోలకు రికార్డులు కట్టబెడుతున్న నెటిజన్లు

Top 10 Most Viewed Telugu Songs

Top 10 Most Viewed Telugu Songs: ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టడానికి పోటాపోటీగా కష్టపడుతున్నారు మన హీరోల ఫ్యాన్స్. అటు బరిలోకి అదిరే సాంగ్ దింపడం వరకే మా బాధ్యత.. రెచ్చి పోవాల్సింది మీరే అన్నట్టుంది మేకర్స్ వరుస. అవును ఇప్పుడలాగే ఒకిరిని మించి ఒకరు 24గంటల్లోనే యూట్యూబ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. నువ్వా నేనా అన్నట్టు 2021లో రికార్డులను తిరగరాశారు.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

స్టార్ హీరోయిన్ సమంత ఫస్చ్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసి ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్ని షేక్ చేసింది. పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అయ్యాక కెరీర్ మీద ఫుల్ ఫోకస్ చేసిన సామ్.. బన్నీ ‘పుష్ప’ కోసం ఐటెం సాంగ్ లో స్టెప్పులేసింది. ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ అంటూ మాస్ బీట్తో సాగిపోయిన ఈ పాట సోషల్ మీడియాలో పాత రికార్డులను తిప్పికొట్టింది. విడుదలైన 24 గంటల్లోనే కోటీ 20లక్షలకు పైగా వ్యూస్ రాబట్టి 2021లో సరికొత్త ఫీట్ అందుకుంది.

Jabardasth Varsha: అల్లరి చూపుల వర్ష.. అందుకు తగ్గ అందం!

లాలా భీమ్లా సాంగ్ వింటేనే పూనకాలొస్తున్నాయి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు చప్పుడు కాస్త గట్టిగా వినిపించడంతో యూట్యూబ్ ని షేక్ చేసి పడేశారు. 24 గంటల్లో కోటీ 2లక్షలతో వ్యూస్ పరంగా సెకండ్ ప్లేస్ కొట్టేసింది లాలా భీమ్లా. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే లాలాకంటే ముందు రిలీజైన ఫస్ట్ సింగిల్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ 24 గంటల వ్యూస్ లెక్కగడితే 82లక్షల 80వేలతో ప్రస్తుతం మోస్ట్ వ్యూయడ్ లిస్ట్ లో టాప్ 5 స్థానాన్ని ఆక్రమించింది.

Spider Man: No Way Home: హాలీవుడ్‌ను సేవ్ చేసిన స్పైడర్ మ్యాన్!

మోస్ట్ వ్యూయ్ డ్ లిరికల్ సాంగ్స్ లిస్ట్ లో 24గంటల్లో సాధించిన వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది పుష్ప. బన్నీ మాస్ లుక్, రష్మిక హాట్ స్టైల్ ను కలగలిపి రిలీజ్ చేసిన సామి సామి సాంగ్ ఈ రికార్డ్ ను క్యాచ్ చేసింది. ఈ ట్రాక్ దాదాపు 90లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇక నాలుగో ప్లేస్ కూడా సుకుమార్ సినిమాదే. అవును పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్ గా బయటికొచ్చిన దాక్కో దాక్కో మేక సాంగ్ 83లక్షలకు పైగా వ్యూస్ తో నాలుగో ప్లేస్ లో ఎక్కడో దాక్కోకుండా 2021లో సవాల్ విసురుతూ నిల్చుంది. శ్రీవల్లీ కూడా ఏం తక్కువ తినలేదు 69లక్షలకు పైగా వ్యూస్ తో టాప్ 10లో 9త్ ప్లేస్ లో ఉంది.

Adah Sharma: ఫిట్ అండ్ హాట్ బ్యూటీ అదా..!

ఇక ట్రిపుల్ ఆర్ హాట్ సాంగ్ నాటు నాటు ఒక ఛానల్ వ్యూస్ చూసుకుంటే 70లక్షలకు పైగా కౌంటింగ్ తో ఎనిమిదో స్థానంలో ఉంది. అదే అప్ లోడ్ చేసిన రెండు ఛానల్స్ వ్యూస్ లెక్కగడితే పుష్ప సామ్ సాంగ్ ను క్రాస్ చేసి కోటీ 38లక్షల వ్యూస్ తో నెవర్ బిఫోర్ రికార్డ్ ను కొట్టినట్టే. ఇదే RRR మూవీలోని జనని అనే సాంగ్కు విడుదలైన 24 గంటల్లో 60 లక్షల 50వేల వ్యూస్ వచ్చాయి.

Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

2020 సంక్రాంతి పందెంలో నిల్చున్న సరిలేరు నీకెవ్వరు నుంచి రిలీజైన మైండ్ బ్లాక్ సాంగ్ ఇప్పటీకీ టాప్ 6 ప్లేస్ లో ఉంది. ఇక అప్పుడే మహేశ్ తో పాటే బరిలోకి అప్పుడు దిగిన బన్నీ అలవైకుంఠపురంలో రాములో రాముల సాంగ్ ఏడో స్థానంలో ఉంటూ టాప్ 10లో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో రిలీజైన సినిమాల మోస్ట్ వ్యూయడ్ సాంగ్స్ లో టాప్ 10 పొజిషన్ కూడా పుష్పదే. ఏయ్ బిడ్డా సాంగ్ ఆ ట్రెండ్ కొనసాగిస్తోంది.
2021లో ట్రిపుల్ ఆర్ దోస్తీ సాంగ్, ఆచార్య పాటలు కూడా సూపర్ ట్రెండ్ లో ఉన్నాయి.

Pan India Films: మారిన రూల్.. బాలీవుడ్‌కి బ్యాండ్ బజాయిస్తున్న టాలీవుడ్!

గత సంవత్సరాల్లో ఉన్న పాత రికార్డులను 2021లో వచ్చిన చాలా పాటలే తుడిచేశాయి. మొత్తంగా చూస్తే టాప్ 10లో 5పాటలు పుష్పవే ఉన్నాయి. భీమ్లా నాయక్ రెండు పాటలు ట్రెండ్ చూపిస్తే.. ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ మాత్రమే టాప్ లిస్ట్ లో చేరింది. వీటితో పాటూ ప్రభాస్ పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్ పాటలు కూడా ఫ్యాన్స్ ను బాగానే అట్రాక్ట్ చేశాయి.