Pan India Films: మారిన రూల్.. బాలీవుడ్‌కి బ్యాండ్ బజాయిస్తున్న టాలీవుడ్!

ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ మేజర్ క్రేజ్ బాలీవుడ్ దే. ఇండియన్ సినిమా హిస్టరీలో మేజర్ షేర్ బాలీవుడ్ దే. కానీ ఇప్పుడు రూల్ మారుతోంది రూలింగ్ మారబోతోంది. ఇప్పటివరకూ సెంటర్ ఆఫ్..

Pan India Films: మారిన రూల్.. బాలీవుడ్‌కి బ్యాండ్ బజాయిస్తున్న టాలీవుడ్!

Pan India Films

Pan India Films: ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ మేజర్ క్రేజ్ బాలీవుడ్ దే. ఇండియన్ సినిమా హిస్టరీలో మేజర్ షేర్ బాలీవుడ్ దే. కానీ ఇప్పుడు రూల్ మారుతోంది రూలింగ్ మారబోతోంది. ఇప్పటివరకూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా సోలో బాస్ గా ఉన్న బాలీవుడ్ సినిమా మీద టాలీవుడ్, హాలీవుడ్ మూకుమ్మడి దండయాత్ర స్టార్ట్ అయ్యింది. నిజంగానే ఇప్పటి వరకూ నార్త్ మార్కెట్ లో సోలో కింగ్ గా ఉన్న బాలీవుడ్ కి చెమట్లు పట్టిస్తుంది టాలీవుడ్.

Balakrishna: బాలయ్య ఓపెన్ ఆఫర్స్.. అందుకొనే దర్శకులెవరో?

బాహుబలి ముందు వరకూ తెలుగు సినిమా అంటే ఏదో ఉందని తెలుసుకానీ.. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాని ఏలుతుందని కనీసం ఊహించి కూడా ఉండరు. బాహుబలితో బాలీవుడ్ రికార్డుల్ని బద్దలుకొట్టిన తెలుగు సినిమా అప్పటి నంచి వస్తున్న ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. బాహుబలి, కెజిఎఫ్ తో పాటు లేటెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప కూడా బాలీవుడ్ తో టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

పుష్ప ఎఫెక్ట్ తోనే ఇప్పటికే కోలుకోని బాలీవుడ్ సినిమాలు.. ముందు ముందు ముంచుకొస్తున్న ట్రిపుల్ ఆర్, ప్రభాస్ రాదేశ్యామ్ జనవరి రిలీజ్ సినిమాలపై ఇంకాస్త వర్రీ అవుతున్నాయి. ఇప్పటికే ఈ తెలుగు సినిమాలు వస్తున్నాయని గుంగూభాయ్ లాంటి సినిమాలు పోస్ట్ పోన్ చేస్కోవడంతో పాటు.. ఆ దరిదాపుల్లో కూడా రిలీజ్ లు పెట్టుకోకుండా జాగ్రత్త పడ్డాయి. స్పెషల్లీ 450 కోట్లతో తెరకెక్కుతున్న ట్రిపుల్ఆర్ ఎఫెక్ట్ బాలీవుడ్ లో విపరీతంగా ఉండబోతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చజరుగుతుంది.

Bigg Boss 5 Winner: సన్నీ మ్యారేజ్ ప్రపోజల్.. రూ.100 కోట్ల కట్నం!

కంప్లీట్ గా మెట్రో సెంట్రిక్ సినిమాలు చెయ్యడంలో బిజీగా ఉన్న బాలీవుడ్.. రూరల్, అర్బన్ ని పెద్దగా కన్ సిడర్ చెయ్యడం లేదు. దాంతో హిందీలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలు బాలీవుడ్ ని విపరీతంగాఎఫెక్ట్ చేస్తాయని, ఇండియన్ బాక్సాఫీస్ మీద తుఫాను దాడి చేస్తాయని విపరీతంగా చర్చజరుగుతోంది బాలీవుడ్ లో. ఇది ఏ రేంజ్ లో ఉంది అంటే.. సాక్షాత్తూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ట్రిపుల్ఆర్ రిలీజ్ అయిన 4 నెలలవరకూ ఏ సినిమాని రిలీజ్ చెయ్యద్దని మిగతా వారికి వార్నింగ్ ఇచ్చేంతలా.

Crazy Combination Films: పేరుకి క్రేజీ కాంబోలు.. కానీ మొదలయ్యేది ఎప్పుడో మిస్టరీ!

తెలుగు సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ ని నెమ్మదిగాఓవర్ టేక్ చేస్తుంటే.. మరో వైపు హాలీవుడ్ కూడా బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన 83 మూవీ కంటే.. డిసెంబర్ 16న రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్.. ఆడియన్స్ ని ఆకట్టుకునేంత. ఫస్ట్ డే కలెక్షన్లు కంపేర్ చేస్తే.. రణవీర్ సింగ్ సినిమా కంటే.. హాలీవుడ్ మూవీ కలెక్షన్లే టాప్ లో ఉండడంతో హాలీవుడ్ మార్కెట్ కూడా బాలీవుడ్ లో గట్టిగానే ఉంది. ఇలా ఒకవైపు టాలీవుడ్, మరో వైపు హాలీవుడ్ బాలీవుడ్ కి బాండ్ బజాయిస్తున్నారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు.