Spider Man: No Way Home: హాలీవుడ్‌ను సేవ్ చేసిన స్పైడర్ మ్యాన్!

హాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. అసలు ఇప్పట్లో సినిమాలు బాక్సాఫీస్ హిట్ కొడతాయా? లాభాలు మాట సరే.. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన హాలీవుడ్..

Spider Man: No Way Home: హాలీవుడ్‌ను సేవ్ చేసిన స్పైడర్ మ్యాన్!

Spider Man No Way Home

Spider Man: No Way Home: హాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. అసలు ఇప్పట్లో సినిమాలు బాక్సాఫీస్ హిట్ కొడతాయా? లాభాలు మాట సరే.. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన హాలీవుడ్ ని స్పైడర్ మ్యాన్ సేవ్ చేశాడు. అంతేకాదు.. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్లతో ఈ సంవత్సరంలో ప్రపంచలోనే హయ్యస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు స్పైడర్ మ్యాన్.

Mahesh-Ram Charan: సమయం లేదు మిత్రమా.. దూకుడు మీదున్న హీరోలు!

రెండేళ్ల నుంచి అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న సినిమాలు ఇప్పుడిప్పేడే నెమ్మదిగా ధియేటర్లోకి వస్తున్నాయి. హాలీవుడ్ లో కూడా ఈమధ్యనే జేమ్స్ బాండ్ కాస్త ఊపుతెస్తే.. లేటెస్ట్ గా వచ్చిన స్పైడర్ మ్యాన్ సూపర్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. డిసెంబర్ 16న రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ 2021 సంవత్సరానికి హయ్యస్ట్ గ్రాసర్ గా ట్రెండ్ సెట్ చేశాడు.

Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ రిలీజ్ అయిన 12 రోజుల్లోనే అక్షరాలా 1 బిలియన్.. అంటే దాదాపు 7 వేల 500కోట్ల రూపాయల కలెక్షన్లతో ఈ సంవత్సరానికి వరల్డ్ వైడ్ గా హయస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. పాండమిక్ స్టార్ట్ అయిన రెండేళ్లలో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాల్లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ హయ్యస్ట్ కలెక్షన్లు సాధించింది.

Adah Sharma: ఫిట్ అండ్ హాట్ బ్యూటీ అదా..!

స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ చైనీస్ మేడ్ కొరియన్ వార్ మూవీ.. బ్యాటిల్ ఆఫ్ లేక్ చాంగ్ జిన్ మూవీ కలెక్షన్లను దాటేసింది. అంతేకాదు.. 2019లో రిలీజ్ అయిన స్టార్ వార్స్ తర్వాత 1 బిలియన్ కలెక్షన్లు సాధించిన సినిమా స్పైడర్ మ్యానే. ఈ సినమా తప్పించి పాన్ డమిక్ పీరియడ్ లో రిలీజ్ అయిన ఏ హాలీవుడ్ సినిమా కూడా స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ కలెక్షన్ల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.