Pooja Hegde : విబేధాల్లేవు.. పూజాతో పనిచెయ్యడం చాలా ఈజీ..

ప్రభాస్, పూజా హెగ్డే, యూవీ క్రియేషన్స్ నిర్మాతల మధ్య విబేధాలున్నాయి అనే వార్తల విషయంలో క్లారిటీ వచ్చేసింది..

Pooja Hegde : విబేధాల్లేవు.. పూజాతో పనిచెయ్యడం చాలా ఈజీ..

Pooja Hegde

Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగు, తమిళ్‌తో అడపాదడపా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకోవడంతో పాటు భారీ పారితోషికం కూడా అందుకుంటుంది. ప్రభాస్ పక్కన నటించిన పాన్ ఇండియా ఫిలిం ‘రాధే శ్యామ్’, అఖిల్‌తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.

Most Eligible Bachelor : ట్రెండింగ్‌లో సూథింగ్ మెలోడీ..

‘కెరీర్ స్టార్టింగ్‌లో పూజా, ఒక అసిస్టెంట్‌తో సెట్‌కి వచ్చేది. ఇప్పుడు స్టార్ డమ్‌తో పాటు వరుసగా సినిమాలు రావడంతో ఏకంగా 12 మంది స్టాఫ్‌తో షూటింగ్ స్పాట్‌‌కి వస్తోంది. అంతమంది అంటే నిర్మాతకి ఖర్చు తడిసి మోపెడవుతుంది. తన పర్సనల్ స్టాఫ్ కారణంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్..?’ అంటూ రోజా భర్త సెల్వమణి ఇటీవల పూజాపై ఫైర్ అయ్యారు. నిర్మాత నట్టికుమార్ కూడా ఆమెకి ఎందుకంత రెమ్యునరేషన్ ఇస్తున్నారంటూ ప్రొడ్యూసర్లను ప్రశ్నించారు.

R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..

ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే ప్రవర్తన పట్ల ‘రాధే శ్యామ్’ నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలపై ‘రాధే శ్యామ్’ నిర్మాతలు స్పందించారు. ‘ప్రభాస్, పూజా హెగ్డే, మా మధ్య విబేధాలున్నాయనే వార్తలు అవాస్తవం. పూజా చక్కటి టైం సెన్స్ ఉంది.. ఆమెతో వర్క్ చెయ్యడం చాలా సులువుగా ఉంటుంది’ అని చెప్పారు.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?