Most Eligible Bachelor : ట్రెండింగ్‌లో సూథింగ్ మెలోడీ..

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీలోని ‘లెహరాయి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది..

Most Eligible Bachelor : ట్రెండింగ్‌లో సూథింగ్ మెలోడీ..

Leharaayi Song

Updated On : September 20, 2021 / 8:42 PM IST

Most Eligible Bachelor: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

Akhil Akkineni : బ్యా‌చ్‌లర్ బాబు వచ్చేస్తున్నాడు..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. ఇటీవల విడుదల చేసిన ‘లెహరాయి’ లిరికల్ సాంగ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గోపి సుందర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా శ్రీమణి లిరిక్స్ రాశారు. యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ చాలా బాగా పాడారు. అఖిల్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్న ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

Pooja Hegde : పూజా హెగ్డే పార్టీ స్టైలే వేరు..!

‘లెహరాయి.. లెహరాయి.. గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి.. లెహరాయి.. లెహరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి’.. అంటూ సాగే ఈ సూథింగ్ మెలోడీ నాలుగు మిలియన్ల మార్క్ దాటేసింది. దసరా కానుకగా అక్టోబర్ 8న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ కానుంది..

Leharaayi : యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారు..