Chandramukhi 2 : చంద్రముఖి గది తాళం తీసేది అప్పుడే.. ఈసారి పాన్ ఇండియా వైడ్!

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చంద్రముఖి సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. చంద్రముఖి గది తాళాన్ని ఈ ఏడాది..

Chandramukhi 2 : చంద్రముఖి గది తాళం తీసేది అప్పుడే.. ఈసారి పాన్ ఇండియా వైడ్!

Raghava Lawrence announce Kangana Ranaut Chandramukhi 2 release date

Raghava Lawrence – Chandramukhi 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో తెరకెక్కిన హారర్ మూవీ ‘చంద్రముఖి’. అప్పటిలో ఈ సినిమా హారర్ మూవీస్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. చంద్రముఖిగా హీరోయిన్ ‘జ్యోతిక’ అందర్నీ బయపెట్టిసింది. 18 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే మధ్యలో ‘నాగవల్లి’ అంటూ చంద్రముఖి కథతో ఒక సినిమా వచ్చినప్పటికీ అది సక్సెస్ కాలేదు. చంద్రముఖి అండ్ నాగవల్లి రెండు చిత్రాలను తెరకెక్కించింది కూడా ఒకడే దర్శకుడు పి వాసు.

Tholi Prema : పవన్ తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తే అమితాబ్‌కి చిరాకు వచ్చిందట.. కోపంతో ఆయన ఏమి చేశాడట!

ఇప్పుడు వస్తున్న ఈ సీక్వెల్ ని కూడా పి వాసునే తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. చంద్రముఖి గది తాళాన్ని ఈ ఏడాది వినాయక చవితి నాడు తీస్తాం అంటూ ప్రకటించారు. ఈసారి చంద్రముఖిని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు కూడా ప్రకటించారు. తమిళ్, తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

Maa Oori Polimera 2 : మా ఉరి పొలిమేర‌-2 కోసం వ‌రుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇక మన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా వాసు అండ్ రాఘవ కాంబినేషన్ లో ‘శివలింగ’ అనే హారర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చి తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తుండడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.