Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర‌-2 కోసం వ‌రుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

స‌త్యం రాజేష్‌, డా.కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, బాలాదిత్య‌, సాహితి దాస‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది.

Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర‌-2 కోసం వ‌రుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

Maa Oori Polimera 2- Varun Tej

Updated On : June 30, 2023 / 6:00 PM IST

Maa Oori Polimera 2- Varun Tej : స‌త్యం రాజేష్‌, డా.కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, బాలాదిత్య‌, సాహితి దాస‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. గ్యాని సంగీతాన్ని అందిస్తుండ‌గా ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. జూన్ 30న సాయంత్రం 4 గంట‌ల 44 నిమిషాల‌కు వ‌రుణ్‌ తేజ్ చేతుల మీదుగా టీజ‌ర్ లాంచ్ ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

Slum Dog Husband Trailer : కుక్క‌ను పెళ్లి చేసుకున్న బ్ర‌హ్మాజీ కొడుకు.. కోర్టులో విడాకుల పంచాయ‌తీ

 

View this post on Instagram

 

A post shared by Rajesh Satyam (@satyamrajesh7)

ఇదిలా ఉంటే.. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘గాంఢీవ‌ధారి అర్జున’ ఒక‌టి కాగా.. మ‌రొక‌టి కొత్త ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ డైరెక్ట‌న్‌లో VT13 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త‌న పెళ్లిలోపు ఈ సినిమాల‌ను కంప్లీట్ చేయాల‌ని వ‌రుణ్ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తుంది. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర్లో వీరి వివాహం ఉంటుంద‌ని అంటున్నారు.

Hello Meera : అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్ బాటలో వెళుతున్న ‘హలో మీరా’ మూవీ..