Tholi Prema : పవన్ తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తే అమితాబ్‌కి చిరాకు వచ్చిందట.. కోపంతో ఆయన ఏమి చేశాడంటే!

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. కానీ ఆ మూవీ క్లైమాక్స్ చూసి అమితాబ్ బచ్చన్ చిరాకు వచ్చిందట. ఆ కోపంతో ఆయన చేతిలో ఉన్న..

Tholi Prema : పవన్ తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తే అమితాబ్‌కి చిరాకు వచ్చిందట.. కోపంతో ఆయన ఏమి చేశాడంటే!

Amitabh Bachchan didnt like Pawan Kalyan Tholi Prema climax

Updated On : June 29, 2023 / 6:34 PM IST

Tholi Prema Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ‘తొలిప్రేమ’ అప్పటిలో ఒక సంచలనం. లవ్ స్టోరీస్ సినిమాలకు ఆ చిత్రం కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయ్యింది. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో ప్రియురాలు కోసం పవన్ పడే వేదన అందర్నీ ఫీల్ అయ్యేలా చేసింది. కేవలం హీరోహీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ మాత్రమే కాదు.. మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్, అన్న చెల్లి రిలేషన్‌లోని బాండింగ్ ని ఎమోషనల్ గా చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు కరుణాకరన్‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కీర్తిరెడ్డిని పరిచయం చేసే సన్నివేశం అయితే ఇప్పటి దర్శకులకు కూడా ఒక రెఫెరెన్స్. ఇక సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Maa Oori Polimera 2 : మా ఉరి పొలిమేర‌-2 కోసం వ‌రుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఇలా చెప్పుకుంటూ పొతే సినిమాలోని ప్రతి సన్నివేశం హైలైట్. మూవీ ఎండింగ్ లో కూడా పవన్ తన ప్రేమని హీరోయిన్ కి చెప్పలేక తనలో తానే ఎంతో మదనపడే సీన్ వన్ సైడ్ లవర్స్ ని ఆకట్టుకున్నప్పటికీ కొంతమంది ప్రేక్షకులకు మాత్రం మింగుడుపడదు. ఆ ఆడియన్స్ లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా ఉన్నారు. ఈ సినిమాని అమితాబ్ తన భార్య జయా బచ్చన్ కలిసి ముంబైలో షో వేయించుకొని చూశారట. మూవీ చివరి నిమిషంలో కూడా హీరో తన ప్రేమని హీరోయిన్ కి చెప్పలేకపోవడం చూసి అమితాబ్ కి చిరాకు వచ్చిందట. ఆ కోపంతో తన చేతిలో ఉన్న కార్ కీ చైన్ ని స్క్రీన్ వైపు విసిరేశారట.

Tholi Prema : తొలిప్రేమ సినిమాకి పవన్ రెమ్యునరేషన్.. ప్రతి నెల ఖర్చులకు కొంత అడిగాడంట..

అయితే ఎండింగ్ లో హీరోయిన్, హీరో దగ్గరకు వెనక్కి తిరిగి వచ్చే సీన్ చూసి జయా బచ్చన్ సంతోషంలో చప్పట్లు కొట్టారట. ఇక ఈ విషయాన్ని మొత్తం అమితాబ్ ఒకసారి చెన్నై పని మీద వచ్చినప్పుడు దర్శకుడు కరుణాకరన్‌ కలుసుకున్నప్పుడు చెప్పారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరుణాకరన్‌ ఈ విషయాన్ని ఆడియన్స్ కి తెలియజేశాడు. కాగా ఈ సినిమా ఈ ఏడాదితో 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుండడంతో జూన్‌ 30న 4K ప్రింట్‌తో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.