Rajamouli : హీరోలని డామినేట్ చేసిన రాజమౌళి.. థియేటర్ వద్ద భారీ కటౌట్..

ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో కూడా అన్ని తానై ముందుండి నడిపిస్తున్నాడు రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి నార్త్ లో 'ఫ్రమ్ ది డైరెక్టర్ అఫ్ బాహుబలి' అని ప్రమోట్ చేస్తున్నారంటే...

Rajamouli : హీరోలని డామినేట్ చేసిన రాజమౌళి.. థియేటర్ వద్ద భారీ కటౌట్..

Rajamouli

 

Rajamouli :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దేశ వ్యాప్తంగా రేపు మార్చ్ 25న ఈ సినిమా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలుండగా రాజమౌళి, చరణ్, తారక్ లు కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచారు. సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లని అభిమానులు ముస్తాబు చేస్తున్నారు. తమ అభిమాన హీరో కటౌట్స్, బ్యానర్స్ కడుతూ హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు హీరోలకే కటౌట్స్ కట్టడం చూశాము. కానీ మొదటి సారి ఒక డైరెక్టర్ కి కటౌట్ పెట్టారు. ‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రపంచంలో కూడా పలు దేశాల్లో ఆ సినిమాని మెచ్చుకునేలా చేశాడు రాజమౌళి. ఎవరైనా సినిమాని హీరోని లేక హీరోయిన్ ని చూసి వస్తారు. కానీ రాజమౌళి సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా రాజమౌళిని చూసే సినిమాకి వస్తారు అది ఆయన రేంజ్.

RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో కూడా అన్ని తానై ముందుండి నడిపిస్తున్నాడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి నార్త్ లో ‘ఫ్రమ్ ది డైరెక్టర్ అఫ్ బాహుబలి’ అని ప్రమోట్ చేస్తున్నారంటే రాజమౌళి సత్తా అది. హీరోలకి సమానంగా రాజమౌళికి కూడా అభిమానులు ఏర్పడ్డారు. తమ అభిమాన హీరోలని అదిరిపోయే క్యారెక్టర్స్ లో చూపించడంతో అభిమానులు రాజమౌళిని మరింత ఇష్టపడుతున్నారు. అందుకే కొంతమంది అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కి ఏకంగా రాజమౌళికి కూడా భారీ కటౌట్ పెట్టారు.

RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..

హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్ వద్ద రాజమౌళి భారీ క‌టౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. ప్రస్తుతం ఈ రాజమౌళి కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది మాత్రమే కాక కొన్ని థియేటర్ల వద్ద బ్యానర్లపై కూడా రాజమౌళి ఫోటోని ముద్రించారు అభిమానులు.