RAPO20: రామ్-బోయపాటి.. బాలీవుడ్ భామలు కాదు.. క్రష్మికే ఫైనల్?

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చుట్టూరి..

RAPO20: రామ్-బోయపాటి.. బాలీవుడ్ భామలు కాదు.. క్రష్మికే ఫైనల్?

Rapo20

RAPO20: అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. రామ్ కెరీర్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇదే కానుంది. అందుకోసమే బోయపాటి క్యాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

RAPO20: ఉస్తాద్ హీరోతో బోయపాటి కన్ఫర్మ్.. పాన్ ఇండియా రేంజ్!

రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ కి సౌత్ ఎలాగూ క్రేజ్ పెరగడం ఖాయం. తర్వాత బోయపాటితో చేసే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు కనుక బాలీవుడ్ మార్కెట్ పట్టుకోవడం ఇంపార్టెంట్. రామ్ ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో అక్కడ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించగా అదనంగా బాలీవుడ్ హీరోయిన్స్ ను యాడ్ చేయాలనుకున్నారు. అందుకే మేకర్స్ ఈ సినిమా కోసం బాలీవుడ్ భామలతో కూడా టచ్ లోకి వెళ్లారు.

RaPo: సౌత్ ఇండియాలోనే ఏకైన హీరో.. ఉస్తాద్ రామ్ రికార్డు!

ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదించగా అమ్మడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని వినిపించింది. ఆ తర్వాత దర్శకుడు బోయపాటి ప‌రిణితి చోప్రాను సంప్రదించగా పాజిటివ్ గా స్పందించినట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఏమైందో ఏమో కానీ ఫైనల్ గా నేషనల్ క్రష్ రష్మికను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బోయపాటి రష్మికను కథ నేరేట్ చేయడం.. రష్మిక డేట్స్ అడ్జెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అదే నిజమైతే రష్మిక మరోసారి సీనియర్ హీరోలు కాకుండా మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది.