RaPo: సౌత్ ఇండియాలోనే ఏకైన హీరో.. ఉస్తాద్ రామ్ రికార్డు!

ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాల మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలకన్నా ఇప్పుడు అక్కడ ప్రేక్షకులకు మన సినిమాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే..

RaPo: సౌత్ ఇండియాలోనే ఏకైన హీరో.. ఉస్తాద్ రామ్ రికార్డు!

Rapo

RaPo: ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాల మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలకన్నా ఇప్పుడు అక్కడ ప్రేక్షకులకు మన సినిమాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే పుష్ప లాంటి సినిమా అక్కడ వందకోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక్క థియేటర్లలోనే కాదు.. యూట్యూబ్ లో కూడా మన సినిమాలకి అక్కడ భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రతి తెలుగు సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

RAPO19: రామ్ – లింగుస్వామి.. యాక్షన్ స్టార్ట్!

డబ్బింగ్ సినిమాల ద్వారా మన హీరోలు నార్త్ లో కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. యంగ్ హీరో రామ్ పోతినేని నేను శైలజా హిందీ డబ్బింగ్ సినిమా గతంలో యూట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకుంది. హలో గురూ ప్రేమకోసమే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి నార్త్ నుండి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. యూట్యూబ్ లో హలో గురూ ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్ 400 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం కాగా మొత్తంగా సౌత్ లోనే హిందీ డబ్బింగ్ సినిమాలలో రామ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు.

RAPO20: ఉస్తాద్ హీరోతో బోయపాటి కన్ఫర్మ్.. పాన్ ఇండియా రేంజ్!

తన దేవదాసు, జగడం సినిమాల ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు హిందీలో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో రిలీజ్ చెయ్యగా వాటి అన్నిటికి కలిపి ఏకంగా 2 బిలియన్ వ్యూస్ వచ్చాయి. బడా స్టార్ హీరోలను కూడా కాదని.. 2 బిలియన్ వ్యూస్ అందుకున్న ఏకైక దక్షిణాది హీరోగా రామ్ నిలిచి సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే ది వారియర్ సినిమాతో హిందీలో కూడా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించనుందని టాక్ నడుస్తుంది. అదే నిజమైతే ఇటు రామ్, అటు పరిణీతి కలిసి ఉత్తరాదిలో కూడా భారీ రెస్పాన్స్ రావడం పక్కాగా కనిపిస్తుంది.

RAPO20: బోయపాటి స్కెచ్.. ఉస్తాద్ హీరో కోసం బాలీవుడ్ భామ?

రామ్ కి రికార్డు వ్యూస్ తెచ్చినపెట్టిన హిందీ డబ్బింగ్ సినిమాల లిస్ట్ ఇదే..

లవ్ ఎక్స్ ప్రెస్ (ఒంగోలు గిత్త)
ఏక్ ఔర్ బోల్ బచ్చన్ (మసాలా)
ఇస్మార్ట్ శంకర్
రెడ్
దుండార్ ఖిలాడీ (హలో గురు ప్రేమ కోసం)
చీటర్ కింగ్ (మసాలా)
బిజినెస్ మెన్ 2 (పండగ చేస్కో)
డేంజరస్ ఖిలాడీ 5 (ఎందుకంటే ప్రేమంట)
డేంజరస్ ఖిలాడీ 4 (కందిరీగ)
ది సూపర్ ఖిలాడీ 3 (నేను శైలజ)
సన్ ఆఫ్ సత్యమూర్తి 2 (హైపర్)
ఎక్స్ ట్రీమ్ రోమియో (శివమ్)
No.1 దిల్వాల (ఉన్నది ఒకటే జిందగీ)
డేంజరస్ ఖిలాడీ రిటర్న్స్ (జగడం)