Updated On - 5:47 pm, Mon, 1 March 21
Chiranjeevi – Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’..
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చిరు, చరణ్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు.
తాజాగా ‘ఆచార్య’ లో తన లుక్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ ఫొటో షేర్ చేశారు చరణ్. ‘‘ఎ కామ్రేడ్ మూమెంట్.. డాడీ మరియు కొరటాల గారితో ‘ఆచార్య’ సెట్స్‌లో ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నా’’నంటూ చెర్రీ పోస్ట్ చేశారు. చిరు, చరణ్ భుజంపై చెయ్యివెయ్యగా, చరణ్ పక్కకి తిరిగి చూస్తున్నారు. సిద్ధ కామ్రేడ్‌గా కనిపించనున్నాడని తెలిసేలా అతని ముందు గన్ చూపించారు.
చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మే 13న సినిమా భారీగా విడుదల కానుంది..
A Comrade moment!
Enjoying every moment with Dad @KChiruTweets & @sivakoratala Garu on #Acharya sets.@MatineeEnt @KonidelaPro pic.twitter.com/FPhSCJf1f1— Ram Charan (@AlwaysRamCharan) March 1, 2021
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..
Sonu Sood : మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్!..
Ugadi Wishes : తెలుగు సినిమాలు.. ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
RRR : తెలుగు ప్రజలకు భీమ్, రామరాజు ఉగాది శుభాకాంక్షలు..
Pooja Hegde : ‘సిద్ధు’డి ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా