Rashmika Mandanna: బ్రేకప్‌తో బిగ్గెస్ట్ సక్సెస్‌లు అందుకుంటున్న కన్నడ కస్తూరి!

వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ.. ఇప్పటికే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన. బాలీవుడ్ భామలు టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ టైమ్ లో కూడా స్టార్ హీరోలతో వరుసగా..

Rashmika Mandanna: బ్రేకప్‌తో బిగ్గెస్ట్ సక్సెస్‌లు అందుకుంటున్న కన్నడ కస్తూరి!

Rashmika Mandanna

Rashmika Mandanna: వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ.. ఇప్పటికే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన. బాలీవుడ్ భామలు టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ టైమ్ లో కూడా స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ.. హీరోలకు ఓన్లీ ఆప్షన్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. అసలు రష్మిక ఈ కెరీర్ కి, సినిమాల స్పీడ్ కి రీజన్ ఒక్క బ్రేకప్. ఒక్క బ్రేకప్ తో రష్మకి కెరీర్ మొత్తం మారిపోయింది. బ్రేకప్ అయితే డిప్రెస్ అవ్వాలి కానీ డబుల్ స్పీడ్ లో రష్మిక ఎలా దూసుకుపోతోంది..?

Rashmika Mandanna: సౌత్ టూ నార్త్ బిజీ బిజీ.. సిటీకో ఇల్లు కొనేసిన రష్మిక!

ప్రస్తుతం తెలుగు తెరను ఏలుతున్న కన్నడ భామ రష్మిక మందన్న. చలో సినిమాతో సక్సెస్ కొట్టిన రష్మిక అదే జోరులో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో టాలీవుడ్ కు కనెక్ట్ అయ్యింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అంతే ఇంటెన్స్ ఎమోషన్స్ క్యారీ చెయ్యడంలో రష్మిక యాక్టింగ్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చెయ్యడంతో స్టార్ హీరోలతో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే ఛాన్సులు కొట్టేస్తోంది.

Rashmika Mandanna : బర్త్‌డే స్పెషల్.. దుల్కర్‌తో రష్మిక.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

అసలు ఫస్ట్ టాలీవుడ్ కి రావడానికే భయపడిన ఈ భామ.. ఇప్పుడు తెలుగు తెరను ఏలేస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ.. సక్సెస్ లు కొడుతోంది. లేటెస్ట్ గా మూడు సినిమాల్లో హీరోయిన్ గా అనౌన్స్ చేశారు రష్మికని. తమిళ్ స్టార్ హీరో విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికకే ఛాన్స్ దక్కింది. అంతేకాదు.. హనురాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమాలో రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

Rashmika Mandanna: యానిమల్ కోసం శ్రీవల్లి అలా మారుతోందా..?

కన్నడ హీరోయిన్ అయిన రష్మిక కెరీర్ ఇప్పుడు స్పీడప్ అయ్యింది. అయితే ఈ స్పీడ్ అంతా ఒక్క బ్రేకప్ తోనే స్టార్టయ్యింది. 20 ఏళ్ల వయసులోనే రష్మకకు రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ అయ్యింది. అంతేకాదు.. త్వరలోనే పెళ్లి అని కూడా అనౌన్స్ చేసేసింది. అయితే రక్షిత్.. కెరీర్, శాక్రిఫైస్ చెయ్యమని అడగడంతో.. రిలేషన్ బ్రేక్ చేసుకుని కెరీర్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది రష్మిక. జనరల్ గా లైఫ్ లో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు డిప్రెస్ అయిపోతారు. కానీ రష్మిక మాత్రం రెట్టించిన స్పీడ్ తో కెరీర్ మీద ఫోకస్ చేసింది.. ఎఫర్ట్ పెట్టి వరసగా ఆఫర్లు దక్కించుకుంటోంది.

Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!

అప్పటి నుంచి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న రష్మక.. సింగిల్ గానే ఉంటోంది. ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే.. సింగిల్ గానే సూపర్ హ్యాపీగా ఉన్నానంటోంది ఈ కన్నడ కస్తూరి. సింగిల్ గా ఉంటూనే కెరీర్ మీద ఫోకస్ చేస్తోంది. ఓన్లీ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. లేటెస్ట్ గా రణబీర్ కపూర్-సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో హీరోయిన్ గా ఫిక్సయ్యింది రష్మిక మందాన.

Rashmika Mandanna: ఐటెం సాంగ్ క్రేజ్.. రష్మిక కూడా ఒకే చెప్పేసిందా?

సౌత్ లో నార్త్ భామలు చక్రం తిప్పుతుంటే.. రష్మిక కూడా నేనేం తక్కువా అంటూ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు కొట్టేస్తోంది. బాలీవుడ్ ఎంట్రీ మీద సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానని, కొత్త ఆడియన్స్ ని రీచ్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెబుతోంది. రష్మిక బాలీవుడ్ లో కోవర్టు ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కుతున్న మిషన్ మజ్ను సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ తో గుడ్ బై సినిమాని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది.