Rashmika Mandanna: యానిమల్ కోసం శ్రీవల్లి అలా మారుతోందా..?

అందాల భామ రష్మిక మందన ఇటీవల కాలంలో ఏ సినిమా చేసినా.. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకుంటోంది.....

Rashmika Mandanna: యానిమల్ కోసం శ్రీవల్లి అలా మారుతోందా..?

Rashmika Mandann Role In Ranbir Kapoor Animal Movie

Rashmika Mandanna: అందాల భామ రష్మిక మందన ఇటీవల కాలంలో ఏ సినిమా చేసినా.. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకుంటోంది. ఇక ఈ బ్యూటీ రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో శ్రీవల్లి అనే డీగ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, తెలుగుతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా దుమ్ములేపింది.

Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!

తాజాగా రష్మిక బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే ‘నేషనల్ క్రష్’ అనే బిరుదుతో యావత్ ఇండియావైడ్‌గా ఈ బ్యూటీ అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా తాజాగా అర్జున్ రెడ్డి ఫేం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ అనే సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది రష్మిక. యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక ఎలాంటి పాత్రలో నటించబోతుందా అనే ఆసక్తి అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతున్ననేపథ్యంలో.. ఈ సినిమాలో అమ్మడి పాత్రపై సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఓ ప్రయోగం కారణంగా ఒక మనిషి జంతువుగా మారితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుందని.. ఇందులో రష్మిక మందన ఓ సైన్స్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లు బీటౌన్ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరో పాత్రకు, రష్మిక పాత్రకు మధ్య కొన్ని సైన్స్‌కు సంబంధించిన సీన్స్ ఉంటాయని, అవి సినిమాలో చాలా ప్రాధాన్యత కలిగిన సీన్స్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Rashmika Mandanna : ఆలోచనలు మారాలి అంటూ.. ఫిట్‌నెస్‌ విషయంలో రష్మిక సలహాలు..

గతంలోనూ స్టూడెంట్ పాత్రలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఇక్కడ స్టార్ బ్యూటీగా మారిపోయి తన సత్తా చాటుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఇలాంటి పాత్రలోనే నటిస్తుండటంతో ఆమెకు అక్కడ కూడా ఎదురులేకుండా పోతుందని ఆమె అభిమానులు అంటున్నారు. మరి నిజంగానే రష్మిక యానిమల్ సినిమాలో స్టూడెంట్ పాత్రలో నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే, ఈ సినిమా నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.