Rashmika Mandanna : ఆలోచనలు మారాలి అంటూ.. ఫిట్‌నెస్‌ విషయంలో రష్మిక సలహాలు..

రష్మిక జిమ్‌లో తీసుకున్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ''ఈ ఫోటో పోస్ట్ చేయడం కరెక్టో కాదో నాకు తెలీదు. మీలో చాలా మందికి ఈ ఫోటో నచ్చకపోవచ్చు. కానీ నేను ఈ ఫోటోని...

Rashmika Mandanna : ఆలోచనలు మారాలి అంటూ.. ఫిట్‌నెస్‌ విషయంలో రష్మిక సలహాలు..

Rashmika

 

Rashmika Mandanna :  సెలబ్రిటీలు అంతా కచ్చితంగా ఫిట్‌నెస్‌ మెయింటైన్ చేస్తారు. అందుకోసం సరైన ఫుడ్ తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తారు. ఇక హీరోయిన్స్ అయితే ఫిట్‌నెస్‌విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. డైలీ వారి ఫిట్‌నెస్‌ మీద ఫోకస్ చేయాల్సిందే. ఇటీవల ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక ఎంత బిజీగా ఉన్నా జిమ్ వర్కౌట్స్, వ్యాయామాలు చేయడం మానదు.

రష్మిక ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తుంది. బిజీ షెడ్యూల్స్‌లో కూడా వర్కౌట్స్ అస్సలు మిస్‌ చేయదు. అంతే కాక అప్పుడప్పుడు తన జిమ్ వీడియోల్ని, యోగా వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది రష్మిక. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో మంచి ఫిట్‌నెస్‌ సాధించాలంటే ఏం చేయాలో చెప్తూ ఓ పోస్ట్‌ చేసింది. దానితో పాటు తన జిమ్ లో తీసుకున్న ఫోటోని కూడా పోస్ట్ చేసింది.

RRR : ఫ్యాన్స్ ఆగ్రహం.. విజయవాడలో థియేటర్ ధ్వంసం..

రష్మిక జిమ్‌లో తీసుకున్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ”ఈ ఫోటో పోస్ట్ చేయడం కరెక్టో కాదో నాకు తెలీదు. మీలో చాలా మందికి ఈ ఫోటో నచ్చకపోవచ్చు. కానీ నేను ఈ ఫోటోని ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మన ఫిట్‌నెస్‌ విషయంలో గోల్స్ ఎప్పుడు స్థిరంగా ఉండాలి. వర్కౌట్స్‌తో, యోగాతో, మంచి డైట్‌తో, మంచి ఆలోచనలతో మన ఫిట్‌నెస్‌ జర్నీని స్థిరంగా మెయింటైన్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. మొదట్లో ఇవన్నీ చాలా కష్టంగానే అనిపిస్తాయి. కానీ ఒక్కసారి అలవాటు చేసి చూడండి. మీలో అద్భుతాలు రావడం గమనిస్తారు. మీ అందరికి నా ప్రేమని పంచుతున్నాను” అంటూ పోస్ట్ చేసింది.