Raviteja : రవితేజ కొడుకు కూతురు ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..? ఫోటోలు వైరల్!
రవితేజ కొడుకు మహాధన్, కూతురు మోక్షద.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Raviteja Son Mahadhan Daughter Mokshadha Bhupatiraju Photos viral
Raviteja Son – Daughter : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక పక్క నటుడిగా మరోపక్క నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నేడు మాస్ హీరోగా ఎంతో ఇమేజ్ ని, అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మాస్ లేగసీని ఇండస్ట్రీలో కొనసాగించేందుకు రవితేజ కొడుకు రెడీ అవుతున్నాడు. రవితేజ కొడుకు పేరు మహాధన్ (Mahadhan). ఇప్పటికే రాజా ది గ్రేట్ (Raja The Great) సినిమాలో రవితేజ చిన్నపాటి క్యారెక్టర్ చేసి ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు.
Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..
ఆ సినిమా తరువాత మళ్ళీ మహాధన్ మళ్ళీ బయట పెద్దగా కనిపించలేదు. తను ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా? రవితేజ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేసే శ్రీనివాస్ రాజ్ గురించి అందరికి తెలిసిందే. రవితేజతో కలిసి కొన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా శ్రీనివాస్ తన సోషల్ మీడియాలో రవితేజ కొడుకు, కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో మహాధన్ కళ్లజోడుతో కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఆరడుగులు ఎత్తు కూడా ఎదిగినట్లు తెలుస్తుంది. ఇక రవితేజ కూతురు మోక్షద.. అయితే రవితేజ సినిమా ఫంక్షన్స్ లో కూడా కనిపించదు.

Raviteja Son Mahadhan Daughter Mokshadha Bhupatiraju Photos viral
శ్రీనివాస్ షేర్ చేసిన ఫొటోలో రవితేజ కూతురిని చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పటి స్టూవర్టుపురం దొంగ కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్ (Renu Desai) ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram