Prabhas : ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను.. కానీ.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులకు ప్రభాస్ హామీ..

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మొదట సినిమా గురించి మాట్లాడాడు. సినిమాలో నటించిన వాళ్ళ గురించి, సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. రామాయణం చేయడం తన అదృష్టం అని తెలిపాడు.

Prabhas : ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను.. కానీ.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులకు ప్రభాస్ హామీ..

Prabhas Speech in Adipurush Pre Release Event

Adipurush : ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మొదట సినిమా గురించి మాట్లాడాడు. సినిమాలో నటించిన వాళ్ళ గురించి, సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. రామాయణం చేయడం తన అదృష్టం అని తెలిపాడు. ఇక పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటా అని తెలిపాడు. ప్రభాస్ ఎక్కువగా మాట్లాడాడు అని తెలిసిందే. ఎప్పుడూ తక్కువగా మాట్లాడే ప్రభాస్ ఈ సారి మాత్రం దాదాపు 10 నిమిషాలు మాట్లాడి ఫ్యాన్స్ ని అలరించారు. ఇటీవల సినిమాలకు కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. వీటిపై స్పందించాడు ప్రభాస్.

ప్రభాస్ మాట్లాడుతూ.. నేను చాలా తక్కువ మాట్లాడతానని తెలుసు. కానీ ఇవాళ ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇక నుంచి నేను తక్కువ మాట్లాడతాను. ఎక్కువ సినిమాలు చేస్తాను. కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాను. కుదిరితే మూడు కూడా చేస్తాను. లేట్ అయితే నాకు సంబంధం లేదు. కానీ తక్కువ మాట్లాడతాను. మీకు సినిమాలు కావాలా? నేను మాట్లాడటం కావాలా? తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తాను నాకు అది బెటర్ అని అన్నారు. దీంతో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Prabhas : తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కామెంట్స్..

ఇక ప్రభాస్ చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆదిపురుష్ తో పాటు సలార్ కూడా రానుంది. దీంతో ఇకపై ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తాడని భావిస్తున్నారు. కానీ ప్రభాస్ చేసే పాన్ ఇండియా సినిమాలకు అంత ఫాస్ట్ గా సినిమాలు అవుతాయా అని కూడా అనుకుంటున్నారు.