Radheshyam : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఫన్నీ స్పీచ్.. నాకు సిగ్గేస్తుంది బాబో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది.

Radheshyam : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఫన్నీ స్పీచ్.. నాకు సిగ్గేస్తుంది బాబో..!

Radheshyam

Radheshyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ” ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను.

చదవండి : Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…

ఇది మాములు లవ్ స్టోరీ కాదు.. గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది.. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీనే కానీ .. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. పూజా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఇక ఈ సినిమా క్లైమాక్ అదిరిపోతుంది. రాధాకృష్ణ గురించి మాట్లాడుతూ.. 5 ఏళ్లు సినిమాలో కూర్చోడమంటే జోక్ కాదు.. సినిమా షూటింగ్‌కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.

చదవండి : Radheshyam : ‘రాధేశ్యామ్’ సెకండ్ సాంగ్ టీజర్ రేపే…

సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో సాహో వలన ఆగి, ఇంకొన్ని రోజులు కరోనా వలన ఆగి .. చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో సాహో ప్రమోషన్స్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తనలో సిగ్గు ఏ మాత్రం తగ్గలేదు.. చాలా బాగా ప్రిపేర్ అయి వచ్చా.. అయినా సిగ్గుపోలేదు.. ఇది ఇక పోదేమో అన్నారు ప్రభాస్. ఈవెంట్‌ని సస్సెస్ చేసిన అభిమానుకు కృతజ్ఞతలంటూ ముగించారు ప్రభాస్