NTR 30-Thalapathy Vijay : అనిరుధ్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ కన్ఫమ్.. ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ పిక్ వైరల్..

NTR 30-Thalapathy Vijay : అనిరుధ్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..

Ntr 30 Thalapathy Vijay

Updated On : January 30, 2022 / 8:55 PM IST

NTR 30-Thalapathy Vijay: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ కి గుమ్మడికాయ కొట్టేసి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ.. తర్వాత సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తారక్, స్టార్ డైరెక్టర్ కొరటాల ‘జనతా గ్యారేజ్’ తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కబోతుంది.

NTR 31 : ‘సలార్’ రెండు పార్టులు! అందుకే బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చాడా?

‘ఆచార్య’ తర్వాత కొరటాల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరినుండి.. హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి నెట్టింట బోలెడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘అరవింద సమేత’ ఛాన్స్ మిస్ అయిన కొలవెరి కుర్రాడు అనిరుధ్ ఈ సినిమాతో తారక్‌తో వర్క్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.

Thalapathy Vijay : అమ్మతో విజయ్.. పిక్ వైరల్..

ఇళయ దళపతి ప్రస్తుతం దిలీప్ నెల్సన్ కుమార్ డైరెక్షన్‌లో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. విజయ్ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా తన హెయిర్ స్టైలిష్ట్‌తో దళపతి కలిసి ఉన్న పిక్‌ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్..