Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్.. | Lakshmi Pranathi entry into Twitter

Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్..

తాజాగా మరో స్టార్ హీరో భార్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తారు. ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియాలోకి.......

Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్..

Lakshmi Pranathi :   సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత హంగామా చేస్తారో మన అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో వారికి కోట్లలో ఫాలోవర్స్ ఉంటారు. సెలబ్రిటీలు కూడా తమ విషయాలన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో, నెటిజన్లతో పంచుకుంటారు. ఇక సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. మన స్టార్ హీరోల భార్యలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికే మహేష్ భార్య నమ్రత శిరోద్కర్, రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ… ఇలా చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు. వారు కూడా కుటుంబానికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటారు. స్టార్ హీరో అభిమానులు వీళ్ళని కూడా ఫాలో అవుతారు.

Arjith Shankar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ తనయుడు

తాజాగా మరో స్టార్ హీరో భార్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తారు. ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. తాజాగా మూడు రోజుల క్రితం రిపబ్లిక్ డే రోజు ఆమె ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Ram Veerapaneni : గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన సునీత భర్త

మొదటగా ఎన్టీఆర్ ట్విట్టర్ లో చెప్పిన రిపబ్లిక్ డే విషెష్ ని షేర్ చేసింది. ఫస్ట్ పోస్ట్ గా ఎన్టీఆర్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”ట్విట్టర్ లో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. పోస్టింగ్ మై ఫస్ట్ ట్వీట్ విత్ మై లవబుల్ హస్బెండ్” అంటూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసింది. ఇక నిన్న రాజమౌళి, రామ రాజమౌళి, ఎన్టీఆర్, ప్రణతిలు ఉన్న పాత ఫొటోని షేర్ చేసింది. ఎన్టీఆర్ అభిమానులంతా ఇప్పుడు ట్విట్టర్లో లక్ష్మి ప్రణతిని ఫాలో అవుతున్నారు.

×