Ram Veerapaneni : గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన సునీత భర్త

ఇటీవల సింగర్ సునీత భర్త రామ్ వీరపనేనికి చెందిన మ్యాంగో సంస్థపై కొంతమంది దాడి చేసిన సంగతి తెలిసిందే. గౌడ కులానికి చెందిన మహిళలను కించ పరిచేలా వీడియోలను ప్రసారం చేశారని కొంతమంది.....

Ram Veerapaneni : గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన సునీత భర్త

Ram Veerapaneni

Ram Veerapaneni :  ఇటీవల సింగర్ సునీత భర్త రామ్ వీరపనేనికి చెందిన మ్యాంగో సంస్థపై కొంతమంది దాడి చేసిన సంగతి తెలిసిందే. గౌడ కులానికి చెందిన మహిళలను కించ పరిచేలా వీడియోలను ప్రసారం చేశారని కొంతమంది ఆ వర్గీయులు మ్యాంగో సంస్థ మీద దాడికి వెళ్లారు. వెంటనే ఆ వీడియోలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తుంది. అయితే తాజాగా వీటిపై రామ్ వీరపనేని తరపున మ్యాంగో సంస్థ ఓ ప్రకటనను విడుదల చేశారు.

వీరు విడుదల చేసిన ప్రకటనలో… ”మ్యాంగ్ 20 సంవత్సరాలకు పైగా ఎలక్ట్రానిక్ డిజిటల్ కంటెంట్ పబ్లిషింగ్ బిజినెస్‌లో ఉన్న కంపెనీ. మేం ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ కంపెనీ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. సోమవారం 24 జనవరి 2022 నాడు కొంత మంది వ్యక్తులు తాము గౌడ్ కమ్యూనిటీకి చెందిన వాళ్లమని, ఒక సినిమా/ వీడియో క్లిప్ గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గౌడ మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారని వాదిస్తూ, పేర్కొన్న కంటెంట్ యూట్యూట్ నుంచి తొలగించాలని కోరారు.

పేర్కొన్న ఫిల్మ్ అప్పటికే సెన్సార్ చేయబడి, సెన్సార్ సర్టిఫికేట్‌తో పాటు యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, స్త్రీలను కించపరుస్తూ చూపే ఎటువంటి సన్నివేశాలను చూపటం ఎన్నడూ మా ఉద్దేశం కాకపోవడం, మా సిద్దాంతాలకు వ్యతిరేకం కావడం వల్ల మేం వెంటనే 24.01.2022న వీడియోను తొలిగించాం. మహిళలందరి పట్ల మాకు అత్యంత గౌరవం ఉందని తెలియజేస్తూ మేం ఇప్పటికే తీసేసిన సబ్జెక్ట్ వీడియో వల్ల పొరబాటున ఎవరైనా మహిళ లేద గౌడ కమ్యూనిటీకి చెందిన ఏ వ్యక్తి యొక్క మనోభావాలనైనా ఒకవేళ పొరబాటు నొప్పించి ఉంటే మేం భేషరుతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము. అటువంటి ఉద్దేశ్యమేదీ మాకు లేదని స్ఫష్టం చేస్తున్నాము.

Chiranjeevi : నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా అమ్మ.. చిరంజీవి తల్లి పుట్టినరోజుపై ఎమోషనల్ ట్వీట్

ఇప్పటికే మేము సోషల్ మీడియాలో గౌడ్ కమ్యూనిటీకి చెందిన నెటిజన్ ల నుండి ఆవేదన వ్యక్తం చేస్తూ మెసేజెస్ మరియు పోస్టులను అందుకుంటున్నందున వారిలో ప్రతి ఒక్కరికి, ఒకవేళ మేము అనుకోకుండా బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాము” అని తెలిపారు.

Shyam Singharoy : నాని సరికొత్త రికార్డు.. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ టాప్ 3లో ‘శ్యామ్ సింగరాయ్’

మ్యాంగో సంస్థకి చెందిన వాక్డ్ అవుట్ మీడియా, తెలుగు ఫిలింనగర్ పేజెస్ ద్వారా ఈ ప్రకటనని సోషల్ మీడియాలో అధికారికంగా తెలియచేశారు.