Shyam Singharoy : నాని సరికొత్త రికార్డు.. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ టాప్ 3లో ‘శ్యామ్ సింగరాయ్’

నెట్​ఫ్లిక్స్ లో 'శ్యామ్​ సింగరాయ్' సినిమా అరుదైన ఘనతను సాధించింది. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అయిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 3,590,000 వ్యూయింగ్ అవర్స్​ను దక్కించుకుంది........

Shyam Singharoy : నాని సరికొత్త రికార్డు.. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ టాప్ 3లో ‘శ్యామ్ సింగరాయ్’

Shyam Singharoy

Nani :  న్యాచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనంలో ఇటీవల వచ్చిన సినిమా ‘శ్యామ్​ సింగరాయ్’​. ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. రాహుల్ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. గతేడాది డిసెంబర్​ 24న విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది.

‘శ్యామ్ సింగరాయ్’ సినిమా జనవరి 21 నుంచి నెట్​ఫ్లిక్స్ ఓటీటీ​లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్​ఫ్లిక్స్ లో కూడా హైయెస్ట్ వ్యూస్ తో దూసుకుపోతుంది. తాజాగా ఏ భారతీయ సినిమాకి దక్కని అరుదైన రికార్డును నాని ‘శ్యామ్ సింగరాయ్’తో సాధించాడు.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

నెట్​ఫ్లిక్స్ లో ‘శ్యామ్​ సింగరాయ్’ సినిమా అరుదైన ఘనతను సాధించింది. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అయిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 3,590,000 వ్యూయింగ్ అవర్స్​ను దక్కించుకుంది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన వారంలో నెట్​ఫ్లిక్స్​లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమ్​ అయిన సినిమాలు, వెబ్​ సిరీస్​ల్లో టాప్​ 3 స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డు సాధించలేదు. దీంతో నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేసింది. నాని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.