Shyam Singharoy : నాని సరికొత్త రికార్డు.. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ టాప్ 3లో ‘శ్యామ్ సింగరాయ్’
నెట్‌ఫ్లిక్స్ లో 'శ్యామ్ సింగరాయ్' సినిమా అరుదైన ఘనతను సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 3,590,000 వ్యూయింగ్ అవర్స్‌ను దక్కించుకుంది........
- Saketh U
- Published on- January 29, 2022 / 10:16 AM IST
Shyam Singharoy
Nani : న్యాచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనంలో ఇటీవల వచ్చిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. గతేడాది డిసెంబర్ 24న విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది.
‘శ్యామ్ సింగరాయ్’ సినిమా జనవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో కూడా హైయెస్ట్ వ్యూస్ తో దూసుకుపోతుంది. తాజాగా ఏ భారతీయ సినిమాకి దక్కని అరుదైన రికార్డును నాని ‘శ్యామ్ సింగరాయ్’తో సాధించాడు.
Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్
నెట్‌ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా అరుదైన ఘనతను సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 3,590,000 వ్యూయింగ్ అవర్స్‌ను దక్కించుకుంది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డు సాధించలేదు. దీంతో నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేసింది. నాని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
