Arjith Shankar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ తనయుడు

తాజాగా శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే నటనలో, దర్శకత్వంలో అర్జిత్ శిక్షణ తీసుకున్నాడు. అర్జిత్...

Arjith Shankar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ తనయుడు

Shankar

Updated On : January 29, 2022 / 12:44 PM IST

Arjith Shankar :  భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శంకర్. ఒకప్పుడు వరుస విజయాలతో తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలని ఊపేసాడు. ఇటీవల కొద్దిగా తడబడినా మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాడు. అంతే కాక ఇండియన్ 2, బాలీవుడ్ లో ఒక సినిమా కూడా శంకర్ చేతిలో ఉన్నాయి. డైరెక్షన్ తో పాటు ప్రొడ్యూసర్ గా కూడా ఎన్నో మంచి సినిమాలని నిర్మించాడు శంకర్.

Ram Veerapaneni : గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన సునీత భర్త

తాజాగా శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే నటనలో, దర్శకత్వంలో అర్జిత్ శిక్షణ తీసుకున్నాడు. అర్జిత్ తన తండ్రి నిర్మించిన ఓ హిట్ సినిమా సీక్వెల్ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. 2004లో శంకర్ నిర్మించిన “కాదల్” చిత్రం, తెలుగులో “ప్రేమిస్తే”గా విడుదలై మంచి విజయం సాధించింది.

Chiranjeevi : నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా అమ్మ.. చిరంజీవి తల్లి పుట్టినరోజుపై ఎమోషనల్ ట్వీట్

ఇప్పుడు ప్రేమిస్తే సినిమాకి సీక్వెల్ రానుంది. కాదల్ పార్ట్ 2లో అర్జిత్ హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కూడా శంకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. భారీ సినిమాలు తీసే శంకర్ తన కొడుకుని చిన్న సినిమాతో ఎంట్రీ ఇప్పించడం విశేషం.