IPL 2023, RCB vs RR: ఉత్కంఠ‌పోరులో కోహ్లి సేన‌దే విజ‌యం

IPL 2023, RCB vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది.

IPL 2023, RCB vs RR: ఉత్కంఠ‌పోరులో కోహ్లి సేన‌దే విజ‌యం

Royal Challengers Bangalore

IPL 2023, RCB vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో దేవదత్ పడిక్కల్ (52; 34 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా య‌శ‌స్వి జైశ్వాల్‌(47; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34 నాటౌట్‌; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స‌ర్లు) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ మూడు వికెట్లు తీయ‌గా, డేవిడ్ విల్లీ, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్టపోయి 189 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(77; 44 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్స‌ర్లు), ఫాఫ్ డుప్లెసిస్‌(62; 39బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. విరాట్ కోహ్లి(0), లోమ్రోర్‌(8), దినేశ్ కార్తిక్‌(16)లు విఫ‌లం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శ‌ర్మ చెరో రెండు వికెట్లు తీయ‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్, చ‌హ‌ల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Virat Kohli: ఏప్రిల్ 23.. విరాట్ కోహ్లికి అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు.. మూడుసార్లు ఈరోజే గోల్డెన్ డ‌కౌట్‌

కోహ్లి గోల్డెన్ డ‌క్‌

బెంగ‌ళూరు జ‌ట్టును ట్రెంట్ బౌల్ట్ గ‌ట్టి దెబ్బ తీశాడు.మొద‌టి బంతికే విరాట్ కోహ్లిని గోల్డెన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి కోహ్లి ప్యాడ్‌ల‌ను తాకింది. దీంతో కోహ్లి ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. మ‌రికాసేప‌టికే షాబాజ్ అహ్మద్‌(2) ను సైతం బౌల్ట్ ఔట్ చేయ‌డంతో 12 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి బెంగ‌ళూరు క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. కెప్టెన్ డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌లు రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి బెంగ‌ళూరు 62/2 తో కోలుకుంది.

వీరిద్ద‌రూ పోటాపోటీగా బౌండ‌రీలు కొట్ట‌డంతో 10 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు 101/2 ప‌టిష్ట స్థితిలో నిలిచింది. ఇదే ఊపు కొన‌సాగితే బెంగ‌ళూరు ఈజీగా రెండువంద‌ల ప‌రుగుల‌ను చేస్తుంద‌ని అనిపించింది. దూకుడు కొన‌సాగిస్తూ మాక్స్‌వెల్ 27 బంతుల్లో, డుప్లెసిస్ 31 బంతుల్లో అర్థ‌శత‌కాల‌ను పూర్తి చేసుకున్నారు. అనంతం మ‌రింత ధాటిగా ఆడే క్ర‌మంలో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వీరిద్ద‌రూ పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. డుప్లెసిస్‌ను సందీప్ శ‌ర్మ ఔట్ చేయ‌గా, మ్యాక్స్‌వెల్‌ను అశ్విన్ ను బోల్తా కొట్టించాడు. దీంతో బెంగ‌ళూరు 156 ప‌రుగుల వ‌ద్ద(14.6వ ఓవ‌ర్‌) నాలుగో వికెట్ కోల్పోయింది.

IPL 2023, RCB vs RR: పోరాడి ఓడిన రాజ‌స్థాన్‌.. బెంగ‌ళూరు విజ‌యం

ఈ ద‌శ‌లో రాజ‌స్థాన్ బౌల‌ర్లు పుంజుకోవ‌డంతో మహిపాల్ లోమ్రోర్(8), ప్రభుదేశాయ్(0)ల‌తో పాటు దినేశ్ కార్తిక్‌(16) బ్యాట్ ఝుళిపించ‌క‌పోవ‌డంతో 200 ప‌రుగుల మార్క్‌ను బెంగ‌ళూరు అందుకోలేక‌పోయింది. చివ‌రికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్టపోయి 189 ప‌రుగులు చేసింది.