RRR: ఆకాశమే హద్దుగా తారక్ మాసివ్ క్రేజ్..!

ఇప్పుడంటే కాస్త తగ్గింది కానీ.. జనవరిలో రిలీజ్ ప్రకటించిన సమయంలో ఆర్ఆర్ఆర్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఎప్పుడెప్ప్పుడు చూద్దమా అని ఎన్టీఆర్-రామ్ చరణ్..

RRR: ఆకాశమే హద్దుగా తారక్ మాసివ్ క్రేజ్..!

Rrr (1)

RRR: ఇప్పుడంటే కాస్త తగ్గింది కానీ.. జనవరిలో రిలీజ్ ప్రకటించిన సమయంలో ఆర్ఆర్ఆర్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఎప్పుడెప్ప్పుడు చూద్దమా అని ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల నుండి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే, అప్పుడు వాయిదా పడడంతో నిరుత్సాహపడిపోయారు. కాగా.. ఇప్పుడు మార్చి 25న సినిమా విడుదల కానుండడంతో మరోసారి ప్రమోషన్లతో రచ్చ చేసేందుకు సిద్దమవుతుంది ఆర్ఆర్ఆర్ యూనిట్. అందుకు సోమవారం ఎత్తారా జెండా పాట రిలీజ్ తో మొదలు కానుంది.

RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. ఆర్ఆర్ఆర్ నుండి మరో పాట

ప్రస్తుతం థియేటర్లలో రాధేశ్యామ్ హవా కొనసాగుతుండడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ మార్చి 14 నుండి మార్చి 24 వరకు వరస పెట్టి ప్రమోషన్ల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. మరోసారి దేశం మొత్తం చుట్టేయనున్న రాజమౌళి అండ్ టీమ్.. దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గర ఓ ప్రమోషన్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే.. ఈలోగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తుంది.

RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో కూడా తెలుగు వాడి ప్రేమ తన అభిమాన హీరోపై ఏ లెవెల్లో ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ పై తమంత తామే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ చేస్తుండగా ఇప్పుడు అయితే ఏకంగా ఒక విమానంతో ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే ఎన్టీఆర్ డైలాగ్ ని ఆకాశంలో ఎగరేసి మరీ తమ ప్రేమని చాటుకున్నారు. దీనితో ఈ మాసివ్ క్రేజ్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు తారక్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో!