RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1

00 కోట్ల బడ్జెట్ ..4 సంవత్సరాల విజన్.. 3 సంవత్సరాల షూటింగ్ ..2 స్టార్ హీరోల స్టామినా, ఒక్క టాప్ డైరెక్టర్ కలిస్తే .. ట్రిపుల్ఆర్ సినిమా. ఇప్పటికే మూడు సార్లు కోవిడ్ కి బలైన..

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1

Rrr Movie

RRR Movie: 500 కోట్ల బడ్జెట్ ..4 సంవత్సరాల విజన్.. 3 సంవత్సరాల షూటింగ్ ..2 స్టార్ హీరోల స్టామినా, ఒక్క టాప్ డైరెక్టర్ కలిస్తే .. ట్రిపుల్ఆర్ సినిమా. ఇప్పటికే మూడు సార్లు కోవిడ్ కి బలైన ఈ పాన్ ఇండియా మూవీ నాలుగో సారి ఒమిక్రాన్ కి ఎఫెక్ట్ అయ్యి సినిమా పోస్ట్ పోన్ చేస్కోవాల్సొచ్చింది. ఇప్పటికే పీక్స్ లో గ్రాండ్ గా ప్రమోషన్లు చేసిన ట్రిపుల్ఆర్ సినిమా కి దిష్టితగిలిందా..? స్టార్ట్ చేసిన దగ్గరనుంచి పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఉండే రాజమౌళి.. ట్రిపుల్ఆర్ విషయంలో ఎక్కడ మిస్ ఫైర్ అయ్యారు..? ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నట్రిపుల్ఆర్ సినిమా ఏముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ఇప్పటి వరకూ ధియేటర్లోకొచ్చే అదృష్టానికి నోచుకోలేదు. ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇద్దరు స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. 500 కోట్ల రిచ్ కంటెంట్ ఫిల్మ్.. అన్నీ ఉన్నా ప్రేక్షకుల ముందుకురావడానికా మాత్రం ఆపసోపాలు పడుతోంది.

RRR Postpone: కొత్త సంవత్సరం కలిసొస్తుందనుకున్నా.. కలగానే మిగిల్చిన ఆర్ఆర్ఆర్

రెండేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న సినిమాని కొత్త సంవత్సరంలో రిలీజ్ చేసి టాలీవుడ్ కి మాంచి ఊపు తీసుకొద్దామనుకన్న రాజమౌళి కల అలాగే మిగిలిపోయింది. 450 కోట్ల భారీ ప్రాజెక్ట్ ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు 50 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేశారు జక్కన్న అండ్ టీమ్. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. పాన్ ఇండియా రేంజ్ లోనే.. అసలు ఇండియాలో ఇప్పటి వరకూ ఏ సినిమాకీ జరగనంత గ్రాండ్ గాప్రమోషన్లు చేయించారు రాజమౌళి. కానీ జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈ సారి కూడా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. ఒక్క వారం.. ఒకే ఒక్కవారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ట్రిపుల్ఆర్ మూవీ.. ఒమిక్రాన్ దెబ్బకి పోస్ట్ పోన్ అయ్యింది.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో పాటు.. నైట్ కర్ఫ్యూ, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ..ఇలా అన్ని రీజన్స్.. ట్రిపుల్ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యేలా చేశాయి. ఇప్పటికే మూడు సార్లు పోస్ట్ పోన్ అయిన ఆ స్టార్ మూవీ ఇప్పుడు నాలుగో సారి పోస్ట్ పోన్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు సార్లు వాయిదాపడింది ట్రిపుల్ ఆర్. సినిమా మొదలైన తర్వాత 2020 జూలై 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. తర్వాత పాండెమిక్ తో 2021 సంక్రాంతి, ఆపై 2021 దసరాకు టార్గెట్ షిఫ్ట్ చేశారు. బట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, కొవిడ్ పూర్తిగా తగ్గకకపోవడంతో మూడోసారి 2022 జనవరి 7 అని కొత్త డేట్ అనౌన్స్ చేశారు.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

కానీ ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ కు నోచులేకపోయింది. అంతకుముందు మూడు సార్లు సినిమా పోస్ట్ పోన్ చేసినా.. అప్పటి వరకూ సినిమా ప్రమోషన్లు కాదు కదా.. సినిమా కంప్లీట్ కూడా కాలేదు. కానీ ఈ సారి అలా కాదు.. అన్ని రకాలుగా సినిమా రెడీ గా ఉంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయి అక్కడ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ తీరా రిలీజ్ టైమ్ వచ్చేసరికి రిస్క్ తీస్కోలేమన్నారు మేకర్స్.