RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

ఊరించి.. ఊరించి.. ఉడికించి ఉరికించి చివరికి ఉసూరుమనిపించారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. ఇప్పటికే ఒకటికి మూడుసార్లు వాయిదా పడడడం.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకులను నిరాశపరచకూడదని కాన్ఫిడెంట్ గా..

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

Rrr Postpone

RRR Postpone: ఊరించి.. ఊరించి.. ఉడికించి ఉరికించి చివరికి ఉసూరుమనిపించారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. ఇప్పటికే ఒకటికి మూడుసార్లు వాయిదా పడడడం.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకులను నిరాశపరచకూడదని కాన్ఫిడెంట్ గా ఉన్న మేకర్స్.. భీమ్లా నాయక్ లాంటి సినిమాలను కూడా పక్కకి తప్పించి విడుదలకి సిద్దమవడం.. అమెరికాలో ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరగడంతో ఈసారి వాయిదా పడే ఛాన్స్ లేదని బలంగా నమ్మారు ఆర్ఆర్ఆర్ అభిమానులు. దాదాపు యాభై కోట్లు ఖర్చు చేసి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు.

Sankranthi Movies : సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు.. మెగా హీరో సినిమా కూడా

మొత్తంగా సినిమా ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తుండగా మళ్ళీ వాయిదా వేస్తున్నాం.. మీ అంచనాలను ఆశలను పదిలంగా అలాగే ఉంచుకోండి మళ్ళీ ఎప్పుడొచ్చేది త్వరలో చెప్తాం అని ప్రకటించేశారు. ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ చెప్పింది కరోనా మళ్ళీ విజృంభణ.. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ఆంక్షల నేపథ్యమే కారణంగా చెప్పారు. అయితే.. ఇంత ఖర్చు పెట్టి పోటీ సినిమాలు లేకుండా చేసి.. బుకింగ్స్ కూడా మొదలు పెట్టి మళ్ళీ వెనక్కి తగ్గడం వెనుక మేకర్స్ వేసుకున్న అసలు లెక్కలేంటి అన్నది ఆసక్తి కరంగా మారింది.

Acharya : ‘ఆచార్య’ ఐటెంసాంగ్ లో మెగాస్టార్ తో స్టెప్పులేసిన రెజీనా

ఆర్ఆర్ఆర్ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు.. ప్రమోషన్లు వగైరా కోసం మరో రూ.50 కోట్లు పెట్టనున్నారు. మొత్తంగా సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ అయితే.. మూడేళ్లుగా దీనికి వడ్డీలు.. ఇతరత్రా ట్యాక్సులు అన్నీ కలుపుకొని రూ.1000 కోట్లు టార్గెట్ గా ఈ సినిమా బరిలో దిగాల్సి ఉంది. అయితే.. కరోనా విజృంభణ కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇప్పటికే థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గించేశారు. మరో వారంలో మరికొన్ని రాష్ట్రాలలో ఇంకా ఆంక్షలు పెంచే అవకాశం ఉంది. లాంగ్ రన్ విషయంలో కూడా కరోనా విజృంభన ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను : చిరంజీవి

ఏపీలో సినిమా టికెట్ల వివాదం ఇంకా ఏదీ తేల్చలేదు. దీంతో కొందరు బయ్యర్లు డిస్కౌంట్లు కావాలని కోరారని టాక్ నడుస్తుంది. దీంతో ఇన్ని లెక్కల మధ్యన సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చినా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాదు.. లాంగ్ రన్ లో పెద్దగా అవకాశం ఉండడం కూడా కష్టమే. సో.. మేకర్స్ అనుకున్న రూ.1000 కోట్లు కష్టమవుతుంది. ఇంతా చేసి సినిమా సక్సెస్ అయినా కమర్షియల్ గా నిరాశపరిస్తే భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. ఈ లెక్కలన్నీ చూసుకొనే అన్ని సక్రమంగా ఉన్నప్పుడే తీసుకొద్దాం అని వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది.