Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను : చిరంజీవి

చిరంజీవి తనంతట తానే ముందుకొచ్చి సినీ పరిశ్రమ కష్టాలపై దృష్టి సారించారు. ఏ రోజు కూడా తాను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోకుండానే సినీ పరిశ్రమ సమస్యల్ని స్వయంగా ప్రభుత్వం వద్దకు.......

Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను : చిరంజీవి

Chiranjeevi Megastar

Chiranjeevi :   సినీ పరిశ్రమలో ఏ కష్టం వచ్చినా, ఏదైనా గొడవ జరిగినా గతంలో దాసరి నారాయణ ఉండి మాట్లాడేవారు. ఆయన మరణం తర్వాత ఆ స్థానానికి లోటు ఏర్పడింది. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో సినీ పరిశ్రమ కష్టాల్లో ఉండగా చిరంజీవి తనంతట తానే ముందుకొచ్చి సినీ పరిశ్రమ కష్టాలపై దృష్టి సారించారు. ఏ రోజు కూడా తాను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోకుండానే సినీ పరిశ్రమ సమస్యల్ని స్వయంగా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లారు. సినీ పరిశ్రమ కార్మికులకు కరోనా కాలంలో ఎన్నో సహాయాలు చేశారు. ఇలా సినీ పరిశ్రమని ముందుండి నడిపించారు.

అయితే ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్ టైంలో ఇండస్ట్రీ పెద్ద అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. చిరంజీవి ఏ రోజు కూడా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోకుండానే పని చేశారు. కాని కొంతమంది ఈ విషయాన్ని బాగా హైలెట్ చేశారు. కొంతమంది మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది వివాదంగా కూడా మారింది. అయితే అప్పుడు ఈ వివాదంపై చిరంజీవి నోరు మెదపలేదు. అప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. సినీ పరిశ్రమ వెన్నంటే ఉన్నారు. తాజాగా ఈ ఇండస్ట్రీ పెద్ద అనే అంశంపై చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi : సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణి చేసిన మెగాస్టార్

ఇవాళ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోధ డయోగ్నస్టిక్ తో కలిసి సినీ కార్మికులకు లైఫ్ టైం హెల్త్ కార్డులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో నేను వుండను. ఆ స్థానం నాకు వద్దు. అవసరం వస్తే తప్పకుండా అక్కడ వుంటాను. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు. ఇండస్ట్రీకి సమస్య ఉన్నా, కార్మికులకు ఏ సమస్యా ఉన్నా ఎప్పుడూ ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాను నేను. అంతేకాని ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యను. సినీ పరిశ్రమని నా కుటుంబంలా భావించి తోడుంటాను” అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.