Chiranjeevi : సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణి చేసిన మెగాస్టార్
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో యోధ డయోగ్నస్టిక్ తో కలిసి సినీ కార్మికులకు లైఫ్ టైం హెల్త్ కార్డులు పంపిణి చేశారు. 50పర్సెంట్ రాయితీతో ఆ కార్డును వినియోగించుకోవచ్చు.

Chiranjeevi
Chiranjeevi : సినీ కార్మికులకు, సినీ పరిశ్రమకు ఎప్పుడు ఆపద వచ్చినా మెగాస్టార్ ముందుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించారు. తాజాగా సినీ కార్మికుల కోసం మరోసారి ముందుకొచ్చారు మెగాస్టార్. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో యోధ డయోగ్నస్టిక్ తో కలిసి సినీ కార్మికులకు లైఫ్ టైం హెల్త్ కార్డులు పంపిణి చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల మెంబర్లకు ఈ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు చిరంజీవి. ఈ కార్యక్రమంలో యోధ డయోగ్నస్టిక్ అధినేత డాక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ”చిరంజీవి గారు మా డయాగ్నస్టిక్ సెంటర్ ని ప్రారంభించినప్పుడు సినీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇచ్చి 50 శాతం ఖర్చు తగ్గిస్తాము అని మేము ప్రామిస్ చేసాము. ఈ రోజున కార్డుల పంపిణీ చేస్తున్నాము” అన్నారు.
Prithvi shaw-Prachi singh : బాలీవుడ్ హీరోయిన్‌తో యువ క్రికెటర్ ప్రేమాయణం
చిరంజీవి మాట్లాడుతూ.. ”కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లైఫ్ అతలాకుతలం అయింది. నా వంతు సాయం నేను చేసాను. సినీ పరిశ్రమకు కూడా ఏదైనా చెయ్యాలి అని యోధ డయాగ్నస్టిక్స్ వారిని అడిగిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు. వారి డయాగ్నస్టిక్ సెంటర్స్ లో ఉన్న సేవలకు 50 శాతం తగ్గిస్తామని సినీ పరిశ్రమలోని కార్మికులకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు పంపిణి చేయటానికి ముందుకొచ్చారు. టెక్నాలజీతో కూడిన ఈ కార్డులో ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇందులో ఆ కార్డుకి చెందిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ప్రస్తుతం 18 యూనియన్ల కార్డులు రెడీ అయ్యాయి. దాదాపు 7700 కార్డులు తయారు అయ్యాయి మిగతావి ఈ నెలాఖరు లోపు అవుతాయి. 50పర్సెంట్ రాయితీతో ఆ కార్డును వినియోగించుకోవచ్చు” అని అన్నారు.
Nani : సమ్మర్ బరిలో సుందరం… నానికి మరో హిట్ గ్యారెంటీ..
ఆ తర్వాత కార్మికులకు ఆ కార్డుని అందచేసి.. ”ప్రతి ఒక్కరూ ఈ కార్డును వినియోగించుకోవాలి. కార్మికులకు సంబంధించి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడూ నేను అండగా వుంటాను. సిని పరిశ్రమ అంతా నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను” అని అన్నారు చిరంజీవి. మరోసారి ఇలాంటి మంచి పని చేసి అభిమానులతో పాటు ప్రజల మన్ననలు పొందుతున్నారు మెగాస్టార్.