Sankranthi Movies : సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు.. మెగా హీరో సినిమా కూడా

ఒక్కసారిగా పెద్ద సినిమాలు తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండగ టైంని క్యాష్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాయి. ఇవాళ మరిన్ని చిన్న సినిమాలు సంక్రాంతికి అనౌన్స్ చేశారు.

Sankranthi Movies : సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు.. మెగా హీరో సినిమా కూడా

Sankranthi Movies (1)

Sankranthi Movies :   ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. కాని ఈ సంక్రాంతికి కరోనా వల్ల, ఏపీలో థియేటర్స్, టికెట్ రేట్ల ప్రాబ్లమ్ వల్ల ఏ సినిమాలు వస్తాయో ఏ సినిమాలు రావో క్లారిటీ ఉండట్లేదు. మొన్నటి వరకు ‘ఆర్ఆర్ఆర్’, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు వస్తాయి అనుకున్నారు. కాని భీమ్లా నాయక్ ముందే పోస్ట్ పోన్ చేసుకోగా ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ కూడా డౌట్ గానే ఉంది. దీంతో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండవేమో అనిపిస్తుంది.

ఇలాంటి పండగల టైంలో ఫ్యామిలీ అంతా కచ్చితంగా సినిమాలకి వస్తారు కాబట్టి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో ఈ టైంని క్యాష్ చేసుకోవాలని ఒక్కసారిగా చిన్న సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగానే నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు సిద్ధూ హీరోగా వస్తున్న ‘డీజే టిల్లు’ సినిమా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ ‘హీరో’ కూడా జనవరి 15న సంక్రాంతికి రాబోతుంది.

Kajal Agarwal : తల్లి కాబోతున్న కాజల్.. అధికారికంగా ప్రకటించిన గౌతమ్

ఇవాళ మరిన్ని చిన్న సినిమాలు సంక్రాంతికి అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాబోతున్న ‘సూపర్ మచ్చి’ సినిమా జనవరి 14న సంక్రాంతికి అనౌన్స్ చేశారు. వీటితో పాటు దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రాబోతున్న ‘రౌడీ బాయ్స్’ సినిమా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇక సుమంత్ అశ్విన్ హీరోగా ఎమ్మెస్ రాజు డైరెక్షన్ లో ‘7 డేస్ 6 నైట్స్’ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు.

Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను : చిరంజీవి

ఒక్కసారిగా పెద్ద సినిమాలు తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండగ టైంని క్యాష్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాయి. మరి ఇన్ని చిన్న సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయో చూడాలి. ఈ సారి పండగ విజేత ఎవరో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.