Acharya : ‘ఆచార్య’ ఐటెంసాంగ్ లో మెగాస్టార్ తో స్టెప్పులేసిన రెజీనా

కొద్ది క్షణాల క్రితమే 'నీతో చానా కష్టం మందాకిని...' అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ లో హీరోయిన్ రెజీనా చిరంజీవితో కలిసి.....

Acharya : ‘ఆచార్య’ ఐటెంసాంగ్ లో మెగాస్టార్ తో స్టెప్పులేసిన రెజీనా

Rejina

Acharya :   మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ అయి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. తాజాగా ‘ఆచార్య’ నుంచి ఓ ఐటెం సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను : చిరంజీవి

కొద్ది క్షణాల క్రితమే ‘నీతో చానా కష్టం మందాకిని…’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ లో హీరోయిన్ రెజీనా చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం విశేషం. ఈ సాంగ్ తో రెజీనా కూడా ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. చిరంజీవి కూడా తన డ్యాన్స్ గ్రేస్ తో మళ్ళీ పాత మెగాస్టార్ ని మరోసారి గుర్తు చేశారు. ఈ సాంగ్ కి థియేటర్లో అభిమానులు రచ్చ చేస్తారని అర్థమైపోతుంది. ఈ ప్రోమో చూసి అభిమానులు ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదలవుతుంది.