Samantha : ‘సాకీ’ లో అక్కినేని ఉందిగా.. సమంత పేరు మారుస్తుందా?

సమంత ఫ్యాషన్ బ్రాండ్ ‘సాకీ’ గురించి నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

Samantha : ‘సాకీ’ లో అక్కినేని ఉందిగా.. సమంత పేరు మారుస్తుందా?

Saaki

Samantha: నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చై – సామ్ విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతగాణ్ణి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Kondapolam : రివ్యూ..

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.

Samantha : ప్రీతమ్, సమంతను ఏమని పిలుస్తాడో తెలుసా?..

రీసెంట్‌గా సమంత కూడా తన గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిరోజుల క్రితం తన పేరు నుంచి అక్కినేని ఇంటి పేరుని వేరు చేసిన సమంత.. ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు పెట్టుకుంది.

Sam Post

 

ఇక చైతు, సమంత ఇద్దరూ కూడా టాటూలు రిమూవ్ చేసుకున్నారని కూడా అంటున్నారు. అయితే గతేడాది సామ్ ‘సాకీ’ అనే ఫ్యాషన్ బ్రాండ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సాకీ’ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడింది సామ్.

Samantha : ఎఫైర్లు, అబార్షన్లపై సమంత ఘాటు స్పందన

అయితే ‘సాకీ’ గురించి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.. ‘సాకీ’ (SAAKI) లో SA అంటే సమంత.. AKI అంటే అక్కినేని.. మరి చై – సామ్ విడిపోయారు కదా.. ఇప్పుడు ‘సాకీ’ పేరు మారుస్తారా?’ అంటూ నెట్టింట్లో పలు కామెంట్స్ కనిపిస్తున్నాయి.

Evaru Meelo Koteeswarulu : తారక్ షో లో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి..